ముఖ్య అనుచరులతో నేడు తుమ్మల భేటీ.. టీఆర్ఎస్‌కు షాక్ తప్పదా?

by samatah |   ( Updated:2022-11-10 09:59:45.0  )
ముఖ్య అనుచరులతో నేడు తుమ్మల భేటీ.. టీఆర్ఎస్‌కు షాక్ తప్పదా?
X

దిశ, వెబ్‌డెస్క్ : మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నేడు(గురువారం) తన అనుచరులతో వాజేడులో పర్యటించనున్నారు. ఇందులో భాగంగానే ఆయన స్వగ్రామమైన గండుగులపల్లి నుంచి వాజేడుకి భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. పర్యటన అనంతరం ఆయన వాజేడులో సింహావలోకనం పేరుతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ముఖ్యనేతలందరూ హాజరవనున్నారు.

అయితే తుమ్మల నాగేశ్వర్ రావు తన అనుచరులతో భేటీ కావడం రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది. అలాగే ఆయన పార్టీకి సంబంధం లేకుండా కార్యక్రమలు చేయడంతో, మరోసారి టీఆర్ఎస్‌కు షాక్ తగల నుందా, తుమ్మల రాజకీయంగా ఏదైనా నిర్ణయం తీసుకోబోతున్నారా అంటూ రాజకీయాల్లో తీవ్ర చర్చచ జరుగుతోంది.

Read more:

1 . జోరు పెంచిన ఈడీ.. నిన్న మంత్రి.. నేడు TRSఎంపీ కార్యాలయంలో దాడులు

2. మునుగోడు ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

3 . వాజేడు ఆత్మీయ సమ్మేళనం.. తుమ్మల ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి..

Advertisement

Next Story