- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం.. అవయవ దాతలకు డబుల్ బెడ్రూమ్!!
దిశ, తెలంగాణ బ్యూరో: అవయవాలు దానం చేసినోళ్లకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్లాన్చేస్తోన్నది. ఇప్పటికే వైద్యారోగ్యశాఖ సీఎం కేసీఆర్‌కు ప్రపోజల్ పంపినట్లు సమాచారం. అంతేగాక పేద పిల్లలకు స్పెషల్ కేటగిరీ కింద గురుకులాల్లోనూ అడ్మిషన్లు ఇవ్వనున్నారు. ఆర్గాన్స్డోనేషన్ల ప్రాధాన్యతను పెంచేందుకే ఆరోగ్యశాఖ ఈ నిర్ణయం తీసుకున్నది. ఇక ఆర్గాన్స్ ట్రాన్స్ ప్లాంటేషన్ల సమయంలో అవయవదానల కోసం ప్రత్యేకంగా హెలి కాప్టర్ను కూడా వాడనున్నారు. జిల్లాల్లోనూ అవగాహన క్యాంపులు పెట్టేందుకు ఆరోగ్యశాఖ ప్రణాళికను సిద్ధం చేస్తోన్నది. ఈ మేరకు టీమ్లకు ట్రైనింగ్‌లు కూడా ఇవ్వనున్నారు. ఆర్గాన్స్సేప్టీ కోసం ప్రతీ ఆసుపత్రిలో స్టోరేజ్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నారు. నోడల్కేంద్రంగా గాంధీ ఆసుపత్రిని తీర్చిదిద్దుతున్నారు. ఏకంగా 9 ట్రాన్స్ప్లాంటేషన్ థియేటర్లను సిద్ధం చేశారు.
ఆర్గాన్స్ కొరత
వైద్య రంగం ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ, కిడ్నీ, కాలేయం, గుండె తదితర అవయవాలను కృత్రిమంగా తయారు చేసే పరిస్థితి ప్రస్తుతానికి లేదు. దీంతో మరణించినోళ్ల అవయవాలను సేకరించి , అవసరమైనోళ్లకు అందజేయడం కోసం జీవన్ దాన్అనే సంస్థను ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది.'అవయవాలు మట్టిలో కలిపే కంటే దానం చేయడం ఎంతో మిన్న' అనే ప్రచారంతో ఆర్గాన్స్ ను సేకరిస్తున్నారు. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, పాంక్రియాస్, చర్మం, కార్నియా, ఎముక కణజాలం, గుండె కవాటాలు, రక్త నాళాలను సేకరించి అవసరమైన రోగులకు దానం చేస్తున్నారు. 2013లో ప్రారంభమైన జీవన్‌దాన్ కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు 1142 మంది నుంచి 4316 ఆర్గాన్స్ సేకరించి, అవసరం ఉన్న వారికి ట్రాన్స్‌ప్లాంట్ చేశారు. ఇప్పటికీ మరో 3180 మంది ఆర్గాన్స్ కోసం రిజిస్ర్టేషన్ చేసుకుని ఎదురుచూస్తున్నారన్నారు. కరోనా నుంచి ఆర్గాన్స్ డోనేట్ చేసే వాళ్ల సంఖ్య మరింత తగ్గింది. దీంతో ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు, అండగా ఉండటం వలన ఆర్గాన్డోనేషన్కు ప్రజలు ముందుకు వస్తారని ప్రభుత్వం భావిస్తున్నది.
చేతులెత్తి మొక్కుతున్నా: హరీష్రావు, ఆరోగ్యశాఖ మంత్రి
బ్రెయిన్డెడ్అయినోళ్ల నుంచి అవయవాలు సేకరించేందుకు సహకరిస్తున్న కుటుంబ సభ్యులందరికీ చేతులెత్తి మొక్కుతున్నా. సమాజంలో వారికి గుర్తింపు నివ్వాల్సిన అవసరం ఉన్నది. అప్పుడే ఆర్గాన్డోనేషన్లు పెరుగుతాయి. దీనిలో భాగంగానే నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే సందర్భంగా హైదరాబాద్‌లోని గాంధీ హాస్పిటల్‌లో 162 మంది ఆర్గాన్ డోనర్ల కుటుంబ సభ్యులను సన్మానించాం. పుట్టెడు దు:ఖంలోనూ అమయవ దానానికి ఒప్పుకుని, ఇంకొకరికి ప్రాణదానం చేసినవారందరూ ఎంతో స్పూర్తిదాయకం