ఆయన అండతోనే రెచ్చిపోతున్నారు.. షాద్‌నగర్‌ ఘటనపై RSP కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |
ఆయన అండతోనే రెచ్చిపోతున్నారు.. షాద్‌నగర్‌ ఘటనపై RSP కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: బంగారం దొంగతనం కేసులో మహిళను షాద్ నగర్‌ పోలసులు కిరాతకంగా కొట్టిన విషయం తెలిసిందే. సోమవారం మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సహా బీఆర్ఎస్ నేతలు బాధితురాలిని పరామర్శించారు. ఈ సందర్భంగా.. ఆర్ఎస్‌ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. ఓ వ్యక్తి ధైర్యం చూసుకునే ఇలాంటి వాళ్లు రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. మహిళ విషయంలో పోలీసు అధికారులు బరితెగించి వ్యవహరించారని సీరియస్ అయ్యారు. గతంలో జరిగిన ఘటనలపై చర్యలు తీసుకోలేదని అన్నారు. అందుకే మళ్లీ ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని అసహనం వ్యక్తం చేశారు. ఘటనకు బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాము కూడా ఈ ఇష్యూను ఎన్‌హెచ్‌ఆర్‌సీ(NHRC) దృ‌ష్టికి తీసుకెళ్తామని అన్నారు. మరోవైపు షాద్‌నగర్‌ ఘటనపై రాష్ట్ర పోలీస్ శాఖ సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళను చితకబాదిన కేసులో డీఐ రాంరెడ్డిని సీపీ అవినాశ్ మహంతి సస్పెండ్ చేశారు. డీఐతో పాటు మరో ఐదుగురు కానిస్టేబుల్స్‌ను కూడా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెండ్ అయిన వారిలో ఓ మహిళా కానిస్టేబుల్ ఉన్నారు.

Advertisement

Next Story