TSPSC పేపర్ల లీక్ వెనుక కోట్ల కుంభకోణం: రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

by Satheesh |   ( Updated:2023-03-28 08:35:57.0  )
Revanth Reddy will not Participate in Munugode Padayatra Due to Covid Symptoms
X

దిశ, వెబ్‌డెస్క్: టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారంపై టీపీసీసీ రేవంత్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఢిల్లీలో మీడియాతో రేవంత్ మాట్లాడుతూ.. టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీలో మంత్రి కేటీఆర్ పాత్ర ఉందని మరోసారి ఆరోపించారు. ఈ కేసులో మంత్రి కేటీఆర్‌కు నోటీసులు ఇవ్వకుండా.. తనకు నోటీసులు ఇచ్చారని చెప్పారు. ఈ కేసును దర్యాప్తు చేస్తోన్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) విచారణ మంత్రి కేటీఆర్ కనుసన్నల్లోనే నడుస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. ఈ పేపర్ లీక్ వ్యవహారంలో మంత్రి కేటీఆర్ పీఏ తిరుపతి ఒక పావు మాత్రమేనని.. దీని వెనుక కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

అంతేకాకుండా టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ వెనుక పాలకులు, ప్రభుత్వాధికారులు పాత్ర ఉందన్నారు. ఈ కేసులో అన్ని దర్యాప్తు సంస్థలు ముందుగా మంత్రి కేటీఆర్‌ని ప్రశ్నించాలని డిమాండ్ చేశారు. కేసులో అసలు దొంగలకే ప్రభుత్వం రక్షణ కల్పిస్తోందని ఎద్దేవా చేశారు. ఈ పేపర్ లీకేజీ వల్ల లక్షల మంది నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని సర్కార్‌పై మండిపడ్డారు. కాగా, ఈ టీఎస్పీఎస్సీ పేపర్ల లీక్‌పై సంచలన ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed