- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భువనగిరి నుంచి పోటీకి నా భార్య సిద్ధం.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటన
దిశ, వెబ్‌డెస్క్: భువనగిరి ఎంపీ టికెట్‌పై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తన భార్య కోమటిరెడ్డి లక్ష్మీని భువనగిరి బరిలో నిలిపేందుకు రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారంటూ వస్తోన్న వార్తలపై ఆయన శుక్రవారం స్పందించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఎంపీ టికెట్ కోసం నా భార్య ప్రయత్నించలేదని స్పష్టం చేశారు. భువనగిరి టికెట్ విషయంలో కొందరు కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.
పార్టీ ఆదేశిస్తే నా భార్య సిద్ధమని ప్రకటించారు. పార్టీలో చేరినప్పుడు మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ అధిష్టానం హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. అంతేకానీ, తమ కుటుంబానికి మూడో టికెట్ కోరుకోవడం లేదని అన్నారు. భువనగిరి టికెట్ బీసీలకు ఇవ్వాలని ప్రతిపాదించినట్లు తెలిపారు. కోమటిరెడ్డి బ్రదర్స్ ఎవరినీ విడదీసే వ్యక్తులు కాదని అన్నారు. తాము పదవులు, అధికారం కోసం ఏనాడూ పాకులాడలేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.