- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఈసారి 5 స్టార్.. వచ్చేసారి 7 స్టార్ అవార్డులిస్తాం: కిషన్ రెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో: గనుల రంగంలో సుస్థిరాభివృద్ధి విధానాలతో ముందుకెళ్తూ ఖనిజాల ఉత్పత్తితోపాటుగా పర్యావరణ పరిరక్షణకు కృషిచేస్తున్న గనులకు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి 5 స్టార్ రేటింగ్ అవార్డులను ప్రదానం చేశారు. ఢిల్లీలోని అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో.. దేశవ్యాప్తంగా అత్యున్నత ప్రమాణాలతో, సుస్థిరాభివృద్ధి నిబంధనలకు అనుగుణంగా మైనింగ్ చేస్తున్న 68 సంస్థలకు కేంద్రమంత్రి 5 స్టార్ అవార్డులను బుధవారం ప్రదానం చేశారు. తెలంగాణకు చెందిన 5 సంస్థలు, ఆంధ్రప్రదేశ్ నుంచి 5 మైనింగ్ సంస్థలు అవార్డులందుకున్న జాబితాలో ఉన్నాయి. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. దేశ ఆర్థికాభివృద్ధిలో గనుల రంగం పోషిస్తున్న పాత్ర కీలకమని, రానున్న రోజుల్లో దేశం గనుల రంగంలో స్వయం సమృద్ధి సాధించే దిశగా మరింత కృషి జరగాలని ఆయన పేర్కొన్నారు.
దేశంలో ఎక్కువ సంఖ్యలో ఉపాధి కల్పిస్తున్నది మైనింగ్ పరిశ్రమే అని ఆయన వివరించారు. మైనింగ్ రంగంలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకునేందుకు, పర్యావరణాన్ని కాపాడేందుకు పనిచేస్తున్న వారందరినీ అభినందించడం కేంద్రప్రభుత్వం బాధ్యత అని ఆయన చెప్పారు. ఈ అవార్డులు.. మైనింగ్ రంగం చేస్తున్న కృషిని ప్రోత్సహించడానికేనని.. ఆయన పేర్కొన్నారు. ఈ వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ హైదరాబాద్ లో ఓ వర్క్ షాప్ నిర్వహించారని గుర్తుచేసిన కేంద్రమంత్రి.. ఆ కార్యక్రమంలో మైనింగ్ పరిశ్రమ ప్రతినిధులు ఇచ్చిన సూచనల ఆధారంగా.. కొత్త నిబంధలను నిర్దేశించుకుని ముందుకెళ్తున్నామన్నారు. మైనింగ్ రంగం, మంత్రిత్వ శాఖ సమన్వయంతో పనిచేస్తూ.. దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉందన్నారు. భారతదేశంలో అపారమైన ఖనిజ సామర్థ్యం ఉందని, దీన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్లాలని కేంద్ర మంత్రి సూచించారు.
క్రిటికల్ మినరల్స్‌ను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని, దేశంలో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటే.. దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉండదని తెలిపారు. మైనింగ్‌లో సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటూ.. అభివృద్ధితోపాటుగా పర్యావరణాన్ని కాపాడేదిశగా పనిచేయాలని మైనింగ్ కంపెనీలకు కిషన్ రెడ్డి సూచించారు. గనుల భద్రత, కార్మికుల భద్రత, ఉత్పత్తిని పెంచడం, పర్యావరణ పరిరక్షణ.. వంటి అంశాల్లో సాంకేతికత వినియోగం చాలా అవసరమని ఆయన అన్నారు. ఇటీవల బడ్జెట్లో.. 25 క్రిటికల్ మినరల్స్ మీద కస్టమ్స్ డ్యూటీని కేంద్రం తొలగించిందని, దీని ద్వారా దేశంలో క్రిటికల్ మినరల్స్ ప్రాసెసింగ్ మెరుగుపడుతుందని కిషన్ రెడ్డి చెప్పారు. భారతదేశం ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందని, రానున్న రోజుల్లో 3వ ఆర్థిక వ్యవస్థగా మారాలని, అందుకు మైనింగ్ రంగం తమ సామర్థ్యానికి అనుగుణంగా పనిచేయాలని కేంద్ర మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రి సతీశ్ చంద్ర దూబే, గనుల శాఖ కార్యదర్శి వీఎల్ కాంతారావు, అదనపు కార్యదర్శి లోహియా, ఐబీఎం సెక్రటరీ జనరల్ పీఎన్ శర్మతో పాటు వివిధ రాష్ట్రాల గనుల శాఖ ఉన్నతాధికారులు, అవార్డు గ్రహీతలు, మైనింగ్ రంగ ప్రముఖులు పాల్గొన్నారు.
5 స్టార్ రేటింగ్ అవార్డులు అందుకున్న సంస్థలివే..
తెలంగాణ నుంచి 5 సంస్థలు 5 స్టార్ రేటింగ్ అవార్డులు అందుకున్నాయి. కాగా అవన్నీ లైమ్ స్టోన్ మైన్స్ కావడం గమనార్హం. తెలంగాణ నుంచి మైహోం-చౌటుపల్లి, టీఎస్ ఎండీసీ-దేవాపూర్(మంచిర్యాల), మైహోం-మేళ్ల చెరువు, రైన్ సిమెంట్స్-నల్లగొండ, సాగర్ సిమెంట్స్-నల్లగొండ సంస్థలు 5 స్టార్ రేటింగ్ అవార్డులు అందుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి అవార్డులు అందుకున్న 5 సంస్థలు కూడా లైమ్ స్టోన్ మైన్సే. అందులో భారతి సిమెంట్స్-కడప, జేఎస్‌డబ్ల్యూ సిమెంట్స్-నంద్యాల, దాల్మియా సిమెంట్స్-నవాబ్‌పేట(తలమంచిపట్నం), అల్ట్రాటెక్-తుమ్మల పెంట, శ్రీ జయజ్యోతి(మైహోం) సిమెంట్స్-కర్నూల్ సంస్థలు అవార్డులు దక్కించుకున్నాయి.