KTR: తెలంగాణలోని ఆ సెగ్మెంట్‌లో ఉప ఎన్నిక ఖాయం

by Gantepaka Srikanth |   ( Updated:2024-08-13 11:07:17.0  )
KTR: తెలంగాణలోని ఆ సెగ్మెంట్‌లో ఉప ఎన్నిక ఖాయం
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఉప ఎన్నిక ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం బాన్సువాడ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్‌లో కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి గురించి వారు కేటీఆర్‌కు వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బాన్సువాడలో ఉప ఎన్నిక రావడం ఖాయమని అన్నారు. పార్టీ మారిన పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రజలు తప్పకుండా బుద్ధి చెబుతారని అన్నారు. అన్ని రకాలుగా గౌరవించినా.. పార్టీ ఎందుకు మారాడో పోచారం శ్రీనివాస్ రెడ్డికే తెలియాలని విమర్శించారు. బీఆర్ఎస్‌ను వీడటం పోచారానికే నష్టమని అన్నారు. పార్టీకి ద్రోహం చేసిన వారు ఎంత పెద్ద వారైనా వారిని విడిచిపెట్టేది లేదని సీరియస్ అయ్యారు. బాన్సువాడ ఉప ఎన్నికల్లో తప్పకుండా పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. త్వరలోనే బాన్సువాడలో పార్టీ శ్రేణులతో సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

Advertisement

Next Story