- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఎమ్మెల్యేగా ఓటమి.. ఎంపీగా పోటీ చేయడంపై ఈటల కీలక వ్యాఖ్యలు
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తానో లేదో తనకు తెలియదని మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్, గజ్వేల్‌లో ఆయన ఓటమి చవిచూశారు. ఈనేపథ్యంలో ఆయన ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయడంపై పార్టీ నిర్ణయమే ఫైనల్ అని స్పష్టంచేశారు. పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటే దాని ప్రకారం నడుచుకుంటానని తెలిపారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గతంతో పోలిస్తే డబుల్ సీట్లు సాధించిందని వెల్లడించారు.
రాబోయే రోజుల్లో అధికారం దిశగా దూసుకుపోతోందని ధీమా వ్యక్తంచేశారు. గాలి ఇతర పార్టీల వైపు వీస్తున్నా.. తప్పుడు ప్రచారం జరుగుతున్నా ప్రజలు బీజేపీని ఆదరించారని తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. 2018లో బీజేపీ 118 స్థానాల్లో పోటీచేసిందని, అందులో కేవలం 1 సీటు మాత్రమే బీజేపీ గెలిచిందని తెలిపారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 111 స్థానాల్లో పోటీ చేస్తే 8 సీట్లు గెలిచిందని ఈటల పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో 36 లక్షల ఓట్లు బీజేపీ తెచ్చుకుందన్నారు. 15 శాతం ఓటు బ్యాంకు సాధించిందని పేర్కొన్నారు.
దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ.. బీజేపీ, ఎంఐఎం, బీఆర్ఎస్ కలిస్తే తమ బలం పెరుగుతుందని, కాంగ్రెస్‌ను కూల్చేస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలపై ఫైరయ్యారు. కడియం వ్యాఖ్యలు సరికావని మండిపడ్డారు. ఆయన చేసిన వ్యాఖ్యలకు, బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు. ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ కు అవకాశం కల్పించినందుకు బీజేపీ ఎమ్మెల్యేలంతా అసెంబ్లీని బహిష్కరించారన్నారు. తమకు ఏ పార్టీతోనూ పొత్తు లేదని, ఉండబోదని స్పష్టంచేశారు. గత ఎన్నికల్లో ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకుంటామని తెలిపారు. కార్యకర్తలు ఎలాంటి నిరుత్సాహానికి గురికావద్దని, రెట్టింపు వేగంతో తిరిగి వస్తామనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సూచించారు.