- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బీఆర్ఎస్ పనైపోయిందన్న విషయం అప్పుడే తెలిసింది.. కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్‌గా మారడం నాకు నచ్చలేదని కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఆదివారం ఓ మీడియా ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్‌గా మారినప్పుడే పార్టీ ఓటమి ఖరారైందన్నారు. దీనిపైనా, పార్టీ నిర్మాణంపైనా అంతర్గత సమావేశాల్లో మాట్లాడినట్లు తెలిపారు. అసలు తాను మొన్నటి ఎన్నికల్లో పోటీ చేయొద్దని నిర్ణయించుకున్నానని.. కానీ, మీరే చేయాలని నాపై ఒత్తిడి చేశారు. తప్పని పరిస్థితుల్లో పోటీ చేయాల్సి వచ్చింది అన్నారు. నా మీదున్న నమ్మకంతో ఘన్‌పూర్ ప్రజలు గెలిపించారని వెల్లడించారు.
అంతేకాదు.. లోక్‌సభ ఎన్నికల్లో కావ్యను నిలబెట్టాలని బీఆర్ఎస్ పెద్దలు ఆలోచిస్తున్నప్పుడు కూడా వద్దని చెప్పాను.. కావ్యను అధికారికంగా ప్రకటించి రోజు నుంచి రాజీనామా చేసేంతవరకు ఒక్కరు కూడా సపోర్ట్ చేయలేదు. తనకు అప్పుడే అర్ధమైంది. బీఆర్ఎస్ గెలుస్తుందన్న నమ్మకం ఎవరిలోనూ లేదు అని అన్నారు. ఆ పరిస్థితుల్లో కాంగ్రెస్ నుంచి ఆహ్వానం వచ్చింది.. అందుకే చేరానని కడియం శ్రీహరి వెల్లడించారు. నేతలపై భూ కబ్జా ఆరోపణలు, ఫోన్ ట్యాపింగ్ కేసు, ఢిల్లీ లిక్కర్ కేసు, రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ వ్యతిరేక పవనాలు వీస్తుండటం కూడా తాను పార్టీ మారడానికి ఒక కారణం అన్నారు. కేవలం తాను నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారాల్సి వచ్చిందన్నారు.