BREAKING: కవిత అరెస్ట్‌పై BRS లీగల్ సెల్ హెడ్ సోమ భరత్ కీలక వ్యాఖ్యలు

by Satheesh |   ( Updated:2024-03-15 11:24:49.0  )
BREAKING: కవిత అరెస్ట్‌పై BRS లీగల్ సెల్ హెడ్ సోమ భరత్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ దూకుడు పెంచింది. ఈ కేసులో నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఇవాళ ఈడీ, ఐటీ జాయింట్ అపరేషన్ చేపట్టింది. ఢిల్లీ నుండి నుండి వచ్చిన కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారుల బృందం హైదరాబాద్ నందినగర్‌లోని కవిత ఇంట్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. కవిత ఇంట్లో సోదాల నేపథ్యంలో ఆమె తరుఫు న్యాయవాదులు.. సోదాలు జరుగుతోన్న కవిత ఇంటికి చేరుకున్నారు. కవిత లాయర్లను అధికారులు బయటే అడ్డుకున్నారు. ఈ క్రమంలో కవిత ఇంట్లో ఈడీ, ఐటీ తనిఖీలపై బీఆర్ఎస్ లీగల్ సెల్ హెడ్ సోమ భరత్ కుమార్ స్పందించారు. కవిత నివాసం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఎమ్మెల్సీ కవిత పిటిషన్ సుప్రీం కోర్టులో ఉందని తెలిపారు.

కేసు కోర్టులో పెండింగ్‌లో ఉండగా.. ఈడీ అధికారులు ఎలా ఆమె ఇంటికి వచ్చి సోదాలు చేస్తారని అభ్యంతరం వ్యక్తం చేశారు. పిటిషన్ విచారణలో ఉండగా సడెన్‌గా ఈ సోదాలు ఎందుకని ప్రశ్నించారు. కవిత పిటిషన్ సుప్రీంకోర్టులో ఉన్న అధికారులు పట్టించుకోరా అని అసహనం వ్యక్తం చేశారు. ఢిల్లీ నుండి ఈడీ అధికారులు ఇలా రావడం కరెక్ట్ కాదన్నారు. దర్యాప్తు అధికారులతో మాట్లాడిన తరువాతనే మరోసారి మీడియాతో మాట్లాడుతానని స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో కవితను అరెస్ట్ చేసే అవకాశం లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. కవిత పిటిషన్ విచారణ పూర్తి అయ్యేవరకు ఎలాంటి చర్యలు తీసుకోమని సుప్రీంకోర్టుకు ఈడీ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు.

Read More..

Breaking News: ఎమ్మెల్సీ కవిత ఫోన్లు సీజ్.. ఇంటి బయటే లాయర్లను అడ్డుకున్న అధికారులు..!

Advertisement

Next Story

Most Viewed