బీఆర్ఎస్ కార్యకర్తల కోసం కేసీఆర్ సంచలన నిర్ణయం.. వారికి కోట్ల రూపాయలు

by Mahesh |
బీఆర్ఎస్ కార్యకర్తల కోసం కేసీఆర్ సంచలన నిర్ణయం.. వారికి కోట్ల రూపాయలు
X

దిశ, వెబ్‌డెస్క్: 2023 డిసెంబర్‌లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ పార్టీ అనూహ్యంగా ఓటమి చెందిన విషయం తెలిసిందే. నాడు ఓటమి చెందినప్పటి నుంచి మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్రంలో ఎదురు గాలి వీస్తుంది. ముఖ్యంగా కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపాల వల్ల బీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చింది. అలాగే గత కొద్ది రోజులుగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చుట్టు రాష్ట్ర రాజకీయం తిరుగుతుంది. దీనిని సమర్ధవంతంగా ఎదుర్కోవడంతో బీఆర్ఎస్ నేతలు సతమతమవుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం మాజీ సీఎం కేసీఆర్ ఓ ప్రముఖ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నరు.

అక్కడి నుంచి సీఎం కేసీఆర్ అధికార కాంగ్రెస్ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. కాళేశ్వరం, లిక్కర్ స్కాం, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పై క్లారిటీ ఇచ్చారు. దీంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ నేతలపై కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును వ్యతిరేకించారు. అలాగే బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు జరిగితే కేసులు, కొట్లాడడానికి 10 కోట్ల రూపాయిలు లీగల్ సెల్‌కు కేటాయించాను. మరి అంత ఎక్కువ దాడులు అయితే కేసీఆర్ స్వయంగా గ్రద్దలాగా వాలి మిమ్మల్ని కాపాడుకుంటాను అనే భరోసా కల్పించారు.

Advertisement

Next Story