- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
17న గులాబీ బాస్ కేసీఆర్ బర్త్ డే వేడుకలు.. బీఆర్ఎస్ సరికొత్త వ్యూహం!
దిశ, డైనమిక్ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైనా బీఆర్ఎస్ పార్టీ కనీసం లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించాలని భావిస్తుంది. ఈ క్రమంలోనే ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్దమైంది. మరోవైపు ఓటమితో నిరుత్సాహంలో ఉన్న క్యాడర్‌లో జోష్ నింపేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తుంది. ఇటీవలే కృష్ణ జలాల వ్యవహారంలో నల్గొండ నిరసన సభ నిర్వహించి కొంత శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపారు. లోక్‌సభ ఎన్నికల్లో గులాబీ శ్రేణులు మరింత జోష్ నింపేందుకు మరో ప్రోగ్రాం చేయనున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 17న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరపనున్నట్లు తెలిసింది. లోక్‌సభ ఎన్నికలే టార్గెట్‌గా కేసీఆర్ జన్మదిన వేడుకలు పార్టీ శ్రేణులు ఘనంగా జరుపనున్నట్లు సమాచారం. కేసీఆర్ రాజకీయ ప్రస్థానం, ఉద్యమ నేపథ్యంలో రూపొందించిన ప్రత్యేక డాక్యుమెంటరీని ప్రదర్శించనున్నారు. లోక్‌సభ ఎన్నికలే టార్గెట్‌గా మైలేజీ కోసం బర్త్ డే వేడుకలు జరుపనున్నట్లు సమాచారం.
కేసీఆర్ బర్త్ డే వేడుకల సందర్భంగా ఇవాళ తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. ఈ నెల 17న కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు తలసాని తెలిపారు. బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో వేడుకలు నిర్వహిస్తామన్నారు. ఆలయాలు, మసీదు, చర్చిల్లో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు జరిగేలా ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. వికలాంగులకు వీల్‌చైర్స్, ఆటో డ్రైవర్లకు ఇన్సురెన్స్ పత్రాలు, పేషేంట్స్ పండ్ల పంపిణీ తదితర సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. కేసీఆర్ 70వ జన్మదినం సందర్భంగా 70 కిలోల భారీ కేక్‌ను కట్ చేయనున్నట్లు తలసాని చెప్పారు.