Aadi Srinivas : కుంభకర్ణుడు నిద్ర లేచినట్లుగా కేసీఆర్ వ్యవహారం : ఆది శ్రీనివాస్

by Y. Venkata Narasimha Reddy |
Aadi Srinivas : కుంభకర్ణుడు నిద్ర లేచినట్లుగా కేసీఆర్ వ్యవహారం : ఆది శ్రీనివాస్
X

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR) వ్యవహారం కుంభకర్ణుడు(Like Kumbhakarna) సుధీర్ఘ నిద్రలేచి పెడబొబ్బలు పెట్టినట్లుగా ఉందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్(Government Whip Aadi Srinivas) ఎద్దేవా చేశారు. నేను కొడితే మామూలుగా ఉండదంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ అసెంబ్లీ ఎన్నికల్లో మా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కొట్టిన దెబ్బకు కేసీఆర్ ఫామ్ హౌస్ లో పడ్డారని, ప్రజలు ఇందిరమ్మ రాజ్యం తీసుకురాగా.. రేవంత్ సీఎం అయ్యారని..మీరు ఈ లాజిక్ ఎందుకు మరిచిపోతున్నారని ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు.

13నెలలు అసెంబ్లీకి రాకుండా, ప్రజలను కలవకుండా ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేసిన కేసీఆర్.. ఈరోజు పంచాయితీ ఎన్నికలు వస్తున్నాయని బయటకు వస్తానంటున్నారన్నారు. కేసీఆర్ కు ఎన్నికలు తప్ప ప్రజల సంక్షేమం ముఖ్యం కాదని ఆయన వైఖరితో అందరికి అర్ధమైందన్నారు. నేను ఇంతకాలంగా గంభీరంగా ఉన్నానని..మౌనంగా చూస్తున్నానని కేసీఆర్ చేసిన వ్యాఖ్యల వెనుక గాంభీర్యం లేదని..బేలతనమే కనిపిస్తుందన్నారు. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ చేసిన ఉద్యమాలను ప్రజలు మెచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి.. ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకోవడాన్ని జీర్ణించుకోలేక తట్టుకోలేక ఫామో హౌస్ కు పరిమితమైన కేసీఆర్ ఈ రోజు ఏదో గంభీరమని మేకపోతు గాంభీర్యం మాటలు మాట్లాడుతున్నారని శ్రీనివాస్ విమర్శించారు.

అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ చేసిన విమర్శలను కాంగ్రెస్ ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, నాయకులు అద్దంకి దయాకర్ సహా వరుసగా పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నాయకులు ఖండిస్తు వస్తున్నారు. కేసీఆర్ నిజంగా ఫామ్ హౌస్ నుంచి ప్రజల్లోకి రావాలని అప్పుడే ఎవరెంటో ప్రజలకు తెలుస్తుందంటూ కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ మాటలకు స్ట్రాంగ్ కౌంటర్లు వేస్తున్నారు.

Next Story