- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: కవిత ఇంట్లో రైడ్స్.. హుటాహుటిన KCR నివాసానికి బయలుదేరిన హరీష్ రావు
దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఐటీ అధికారుల సోదాలు కలకలం రేపుతున్నాయి. ఇవాళ ఢిల్లీ నుండి వచ్చిన 10 మంది ఈడీ, ఐటీ అధికారుల బృందం హైదరాబాద్‌లోని కవిత ఇంట్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈడీ జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలో నాలుగు బృందాలు జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి. కాగా, దేశ రాజకీయాల్లో సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవిత తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఉన్న నిందితులతో కవిత లావాదేవీలు జరిపినట్లు ఆరోపిస్తున్న ఈడీ.. గతంలో రెండు సార్లు ఆమె నోటీసులు ఇచ్చి విచారించారు. తాజాగా కవిత ఇంట్లో జరుగుతోన్న ఈడీ, ఐటీ సోదాలు కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించేనని సమాచారం.
ఇక, కవిత ఇంట్లో కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులు సోదాలు జరుపుతుండటం బీఆర్ఎస్‌లో సంచలనంగా మారింది. కవిత ఇంట్లో ఈడీ, ఐటీ సోదాల విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు హుటాహుటిన బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌ను కలవడానికి బయలుదేరారు. తన ముందస్తు పోగ్రామ్‌లు అన్ని రద్దు చేసుకుని హైదరాబాద్‌లోని కేసీఆర్ నివాసానికి హరీష్ రావు వెళ్లారు. ఈడీ, ఐటీ సోదాలకు కారణాలేంటి.. నెక్ట్స్ ఎలాంటి యాక్షన్ తీసుకోవాలన్న దానిపై కేసీఆర్, హరీష్ రావు చర్చించనున్నారు. మరోవైపు ఎన్నికల ముంగిట కవిత ఇంట్లో సోదాలు చేయడంపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమంటున్నారు. ఎన్నికల్లో కేసీఆర్‌ను ఎదుర్కొలేక బీజేపీ భయపడి ఈడీ, ఐటీలను ప్రయోగిస్తోందని మండిపడుతున్నారు.