ఆధ్యాత్మికతపై కేసీఆర్‌వి ప్రగల్భాలే.. బండి సంజయ్ సెటైర్!

by Sathputhe Rajesh |   ( Updated:2023-06-21 12:07:55.0  )
ఆధ్యాత్మికతపై కేసీఆర్‌వి ప్రగల్భాలే.. బండి సంజయ్ సెటైర్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: సీఎం కేసీఆర్‌ని టార్గెట్ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్ వైఖరి భారతీయ సనాతన ధర్మాన్ని పక్కన పెట్టి ఈ ధర్మాన్ని తిట్టేవారిని తలకెత్తుకునేలా ఉందని ధ్వజమెత్తారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇవాళ ప్రభుత్వం ఆధ్యాత్మిక దినోత్సవం నిర్వహిస్తుండగా దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. 'హిందుగాళ్ళు, బొందుగాళ్ళు అంటూ దుర్భాషలు.. భయంకర హిందువుని నేనంటూ ప్రగల్భాలు. యాదాద్రేమో మీకు పెట్టుబడి. కొండగట్టు, ధర్మపురి, వేములవాడ, కొమురవెల్లి, బాసర, భద్రాద్రి, జోగులాంబ ఆలయాలకు నిధుల కేటాయింపేమో మొక్కుబడి. కోట్లకు కోట్లు ఇస్తాననే మాటలే తప్ప చేతలు లేవు. భారతీయ సనాతన ధర్మాన్ని పక్కన పెడతావు. ఈ ధర్మాన్ని తిట్టేవాన్ని తలపైకెత్తుకుంటావు. ఆత్మ సాక్షిగా కూడా అబద్ధమే చెప్పే నీకు ఆధ్యాత్మికత ఇంకెక్కడిది?' అంటూ ప్రశ్నించారు.

Also Read..

శంకరమ్మకు బీఆర్ఎస్ అధిష్టానం పిలుపు.. కారణమదేనా..?

Advertisement

Next Story