- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
KCR: కేసీఆర్ చేతి కర్ర మాయం.. అధికార పక్షానికి ఇక దబిడిదిబిడేనా!
దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమిని మూటగట్టుకున్న బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయింది. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో 7 నెలల సుధీర్ఘ విరామం తరువాత గులాబీ బాస్ మొదటిసారిగా ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతున్నారు. గురువారం బడ్జెట్ ప్రవేశపెడుతున్న తరుణంలో ఆయన కాసేపటి క్రితం హైదరాబాద్‌లోని నందీనగర్ నివాసం నుంచి బయలుదేరారు. ఫస్ట్ టైం ఆన్ స్క్రీన్ ఆయన చేతికర్ర సాయం లేకుండా అసెంబ్లీకి హాజరు కాబోతున్నారు. ఈ నేపథ్యం ఆయన నివాసం ఎదుట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు హల్‌చల్ చేశారు. కేసీఆర్ కారు ఎదుట గుమ్మడికాయ కొట్టి గులాబీ రేకులు చల్లుతూ అసెంబ్లీకి సాగనంపారు. అయితే, మొదటిసారి అసెంబ్లీకి హాజరవుతోన్న గులాబీ బాస్ అధికార పక్షంపై ప్రశ్నల వర్షం కురిపించి ఇరుకున పెడతారా.. లేక ప్రతి విమర్శలతో ఇక్కట్లు పడతారా వేచి చూడాల్సిందే మరి