- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మహిళ అని చూడకుండా గవర్నర్‌ను అవమానిస్తున్నారు.. రామచంద్ర రావు ఫైర్
దిశ, డైనమిక్ బ్యూరో : మహిళ అని కూడా చూడకుండా కేసీఆర్ గవర్నర్‌ను అవమానిస్తున్నారని బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్ర రావు ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన... బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగంతోనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది రెండవ సారి అని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి విధి విధానాలు లేకుండా పోయాయని.. రాష్ట్రపతి ముర్మూను అవమానపరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనవాయితీగా వస్తోన్న సంప్రదాయాన్ని ఎందుకు కాలదొస్తున్నారు? అని ప్రశ్నించారు. ప్రొరోగ్ చేయకుంటే గవర్నర్ ఆర్డినెన్సు చేయడానికి వీలు ఉండదు.
ఈసారి అయిన అసెంబ్లీ సమావేశాలు ప్రతిపక్ష సభ్యులతో జరిగేలా చూడాలని కోరారు.కేసీఆర్ ఈటల మొహం చూడకూడదని గత సెషన్స్‌లో ఆయనను సస్పెండ్ చేయించారని... తెలంగాణలో మళ్ళీ నిజాం పరిపాలన తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఇటువంటివి ప్రజలు చూస్తూ ఉర్కోరని హెచ్చరించారు. మరోవైపు, గవర్నర్ యూనివర్శిటీ రిక్రూట్మెంట్ బిల్లుల మీద వివరణ ఇవ్వలేదన్నారు. సీఎం ప్రజల సమస్యలు పట్టించుకోరు కాబట్టి గవర్నర్ నేరుగా ప్రజలు సమస్యలు వింటున్నారని అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ సమావేశాల నుండి ప్రతిపక్ష ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీలో ప్రతిపక్షాలు ఉండొద్దు, గవర్నర్ స్పీచ్ ఉండొద్దని కేసీఆర్ భావిస్తున్నారని రామచంద్రరావు అన్నారు.