- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్‌కు చంచల్గూడ ఖాయం : పొన్నాల
దిశ, తెలంగాణ బ్యూరో : కేసీఆర్ చంచల్గూడ జైలుకు వెళ్లడం ఖాయమని పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య పేర్కొన్నారు. కాంగ్రెస్ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై ఫోకస్పెట్టిందన్నారు. గురువారం ఆయన గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ... రూ.5 లక్షల కోట్లు అప్పు చేసి కేసీఆర్రాష్ట్రాన్ని దివాళా తీసే పరిస్థితికి తీసుకువచ్చాడని ఆరోపించారు. దేశంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్గురువింద నీతులు చెబుతూ కాలం ఎల్లదీస్తున్నారన్నారు. ఖమ్మం బహిరంగ సభలో దేశం గురించి కేసీఆర్ మాట్లాడితే చాలా ఆశ్చర్యంగా ఉన్నదన్నారు. కేసీఆర్ మాటలు సంక్రాంతికి ఆధునిక తుపాకీ రాముడు మాదిరి ఉన్నాయన్నారు. ఫిరాయింపుల చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్న కేసీఆర్, మోడీలు ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కుతున్నారని దుయ్యబట్టారు.
దళిత బంధు మోసం..
రాష్ట్రంలో దళిత బంధు పేరిట కేసీఆర్దళితులను మోసం చేస్తున్నాడని పొన్నాల ఆరోపించారు. 17 లక్షల మంది అర్హులు ఉంటే ఇప్పటి వరకు కేవలం 30 వేల మందికి మాత్రమే ఇచ్చారన్నారు. ఎన్నికల తర్వాత అది కూడా బంద్అయ్యే ఛాన్స్ఉన్నదన్నారు. గత ఎన్నికల ముందు మూడెకరాల భూమి అంటూ కేసీఆర్ మోసం చేయడాన్ని ఆయన గుర్తు చేశారు. మన దేశం ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ ఆహార ధాన్యాలు ఎగుమతి చేస్తున్నదన్నారు. సుమారు 105 దేశాలకు ఎగుమతి చేస్తున్నామన్నారు. మిషన్ భగీరథ కోసం రూ.40 వేల కోట్లు ఖర్చు పెట్టినా నీళ్లు తాగలేని దుస్థితి ఉన్నదన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉండగా ప్రజలకు 9 రకాల సరుకులు ఇచ్చినం. కానీ బీఆర్ఎస్కేవలం బియ్యం ఇచ్చి చేతులు దులుపుకుంటుందని మండిపడ్డారు.