- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
KCR గొప్ప నాయకుడు.. దానం నాగేందర్ షాకింగ్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై ఖైరతాబాద్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సికింద్రబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం దానం మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ గొప్ప నాయకుడు అని.. పక్కన ఉన్న వాళ్లే ఆయన్ను భ్రష్టు పట్టించారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నా కోసం కేటీఆర్ కోర్టుకు వెళితే.. అక్కడే నా సమాధానం చెబుతా అని అన్నారు. నాడు వాళ్లు చేసింది సబబు అయితే.. ఇప్పుడు ఇది కూడా కరెక్టే అని తెలిపారు. తాను ఆస్తులు కాపాడుకోవడానికి పార్టీ మారలేదని.. బీఆర్ఎస్‌లో సరైన గుర్తింపు దక్కకపోవడం మూలంగానే మారాల్సి వచ్చిందని అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి మూడు నెలల్లో రూ.3500 కోట్లు సంపాదిస్తే.. పదేళ్లలో బీఆర్ఎస్ నాయకులు ఎంత సంపాదించి ఉంటారో ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు. తప్పకుండా సికింద్రబాద్‌లో ఎంపీగా గెలిచి పార్లమెంట్‌కు వెళ్తానని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు దానం నాగేందర్‌కు వ్యతిరేకంగా తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆయనపై అనర్హత వేటు వేసేలా అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను ఆదేశించాలంటూ రాజు యాదవ్ అనే వ్యక్తి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ గుర్తుపై గెలుపొంది.. కాంగ్రెస్ పార్టీ తరపున సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారని చెప్పారు. ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి తన పదవికి రాజీనామా చేయకుండా మరో పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేయడం చట్ట విరుద్ధమని పిటిషన్‌లో పేర్కొన్నారు.