- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
KCR: అసెంబ్లీకి బయలుదేరిన గులాబీ బాస్.. పార్టీ శ్రేణుల్లో కోలాహలం

దిశ, వెబ్‌డెస్క్: బడ్జెట్ సమావేశాల్లో (Budget Sessions) పాల్గొనేందుకు బీఆర్ఎస్ (BRS) అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ (KCR) కాసేపట్లో అసెంబ్లీ (Assembly)కి చేరుకోనున్నారు. ఈ మేరకు ఆయన కాసేపటి క్రితమే హైదరాబాద్ (Hyderabad) నందినగర్ (Nandi Nagar)లోని తన నివాసం నుంచి బయలుదేరారు. తమ అధినేత చాలా రోజుల తరువాత అసెంబ్లీకి వెళ్తున్న తరుణంలో పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు, నాయకులు నందినగర్‌కు చేరుకుని కేసీఆర్ జిందాబాద్ అంటూ ఆయన కారుపై పూలు చల్లుతూ నినాదాలు చేశారు. అయితే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ (Governor Jishnu Dev Sharma) ప్రసంగించనున్నారు. అనంతరం సభలో చర్చించే అంశాలపై ఎజెండా ఖరారు చేసేందుకు బీఏసీ (BAC) సమావేశం నిర్వహించనున్నారు. ఆ మీటింగ్‌లో సభను ఎన్ని రోజులు నిర్వహించాలనే విషయంపై క్లారిటీ రానుంది. ఈ క్రమంలోనే అసెంబ్లీలో పలు అంశాలపై అధికార, ప్రతిపక్ష పార్టీ సభ్యుల మధ్య వాడీవేడి చర్చ జరగే అవకాశం ఉంది.
కాగా, బడ్జెట్ సమావేశాలు నెల చివరి వరకు కొనసాగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. 13న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మాణంపై గురువారం ఉభయ సభల్లో వేరువేరుగా చర్చించి ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేయనున్నారు. 17, 18 తేదీల్లో బీసీలకు విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణను ఆమోదిస్తూ తీర్మానాలు చేయనున్నట్లుగా సమాచారం.