KCR అంటే ఒక ఇన్స్టిట్యూషన్.. నాట్ ఏ పర్సన్

by Disha Web Desk 9 |
KCR అంటే ఒక ఇన్స్టిట్యూషన్.. నాట్ ఏ పర్సన్
X

దిశ, వెబ్‌డెస్క్: కేసీఆర్ అంటే ఒక ఇన్స్టిట్యూషన్.. నాట్ ఏ పర్సన్ అని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. మంగళవారం ఓ మీడియా ఛానల్ ప్రతినిధితో కేసీఆర్ మాట్లాడుతూ.. ఉద్యమం సమయంలో జరిగిన ఆరోపణలు తిట్టిన తిట్ల ముందు ఇప్పుడు చేసే ఆరోపణలు, తిట్టే తిట్లు పెద్ద లెక్క కాదని యాంకర్ ప్రశ్నను సులువుగా కొట్టిపారేశారు. ఇందిరా గాంధీ కూడా ఇండియా అంటే ఇందిరా, ఇందిరా అంటే ఇండియా అనేంత ఎత్తుకు ఎదిగి, ఆ పేరు దక్కించుకుని, అహంకార ధోరణితో ఎమర్జెన్సీ పెట్టి పాలించిందని కేసీఆర్ వెల్లడించారు. ప్రధానమంత్రి హోదాలో ఉండి కూడా ఎవరిని ఏం చేయలేకపోయిందన్నారు. ఒక భావజాలమైన పుట్టుకే జనతా పార్టీ జైల్లో నుంచి పుట్టిందన్నారు. జస్ట్ జైల్లో నుంచి పుట్టి 40, 50, 60, 70 రోజుల్లో కేంద్ర ప్రభుత్వాన్ని చేపట్టిందని పేర్కొన్నారు.

కాబట్టి అలా అనుకోవడానికి వీల్లేదు.. కేసీఆర్ అంటే ఒక ఇన్స్టిట్యూషన్.. నాట్ ఏ పర్సన్ అన్నారు. తాను శూన్యంలో నుంచి సునామీ సృష్టించి, దిక్కుతోచని పరిస్థితిలో ఏం చేద్దాం మన బతుకులు ఇంతేనా? అనే పరిస్థితిలో తెలంగాణ ప్రజల కోసం స్వయంగా ఒక పార్టీ స్థాపించానని తెలిపారు. ఆ పార్టీని మహాసుడిగాలిగా, ఉద్యమరూపంలో దాన్ని నడిపి నేను అనుకున్న లక్ష్యాన్ని సాధించానని వెల్లడించారు.

Read More...

అందుకే రీడిజైన్ చేయాలని ఇంజినీర్లకు చెప్పా.. కాళేశ్వరంపై క్లారిటీ ఇచ్చిన KCR



Next Story

Most Viewed