బీఆర్ఎస్ హయాంలో తాగినోడు తాగుబోతు.. ఇప్పుడు తాగినోడు మంచోడా?: KCR

by Disha Web Desk 9 |
బీఆర్ఎస్ హయాంలో తాగినోడు తాగుబోతు.. ఇప్పుడు తాగినోడు మంచోడా?: KCR
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియా ప్రతినిధితో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో ఎవరైనా మద్యం సేవిస్తే వారిని మందుబాబు అని ముద్ర వేశారు.. ఇవాళ కాంగ్రెస్ హయాంలో మందు తాగితే వారిని వేసవితాపానికి తాగుతున్నారని అంటున్నారు.. ఇంత దరిద్రమైన రాజకీయాలను తాను ఏనాడూ చూడలేదని కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలను మరోసారి గుర్తుచేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన 3-4 నెలల్లోనే 24 గంటల కరెంట్ ఇచ్చామని చెప్పారు. దారుణంగా ఉన్న విద్యుత్ వ్యవస్థను చక్కదిద్దామన్నారు. అలాగే తెలంగాణలో పవర్ ప్లాంట్‌లకు శ్రీకారం చూట్టామని తెలిపారు.

కొంతమంది అవగాహన లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం కేసీఆర్ చేశారు. బట్టకాల్చి మీద వేయాలని చూస్తున్నారన్నారు. అజ్ఞానం, అహంకారపూరితంగా కాంగ్రెస్‌ నాయకులు వ్యవహరిస్తున్నారని కేసీఆర్‌ అన్నారు. కేసీఆర్‌ ఆనవాళ్లు లేకుండా చేస్తానని ముఖ్యమంత్రి శాసనసభలో అన్నారని గుర్తు చేశారు. ఆ ఆలోచన ఎంతటి వికృతమైందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ 10 ఏండ్లు అధికారంలో లేదు.. ఆ పార్టీ పోయిందా? అని ప్రశ్నించారు. ఎవరి టైమ్‌ కోసం వాళ్లు వెయిట్‌ చేస్తుంటారు. కచ్చితంగా వాళ్ల టర్న్‌ వస్తుంది. ప్రజల్లో మార్పు వచ్చినప్పుడు. వాళ్ల ఆలోచన సరళి మారుతుందని అన్నారు.

Read More...

BREAKING: దేవుళ్ల మీద ఒట్లు.. కేసీఆర్ మీద తిట్లు, ఇప్పుడు ఇదే రాజకీయం: గులాబీ బాస్ సంచలన వ్యాఖ్యలు



Next Story