- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Flexi Politics: మరోసారి ఒకే ఫ్లెక్సీలో కేసీఆర్, చంద్రబాబు, పవన్.. ఎక్కడంటే?

దిశ, డైనమిక్ బ్యూరో: మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ మండల కేంద్రంలోని గట్టు మైసమ్మ జాతరలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ (KCR), టీడీపీ చీఫ్, ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu), జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ముగ్గురి ఫొటోలతో ఫ్లెక్సీని కొంతమంది అభిమానులు ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలో వీరితో పాటు దివంగత నేత ఎన్టీఆర్, నటుడు మెగాస్టార్ చిరంజీవి, ఏపీ మంత్రి లోకేశ్, బీఆర్ఎస్ మాజీ మంత్రులు (KTR) కేటీఆర్, హరీశ్‌రావులు సైతం ఉన్నారు.
అయితే ఈ ఫ్లెక్సీలో బాస్ ఈస్ బ్యాక్ అంటూ చంద్రబాబుకు, ట్రెండ్ సెట్టర్ అంటూ పవన్‌కు, గాడ్ ఆఫ్ తెలంగాణ కమింగ్ సూన్.. అంటూ కేసీఆర్‌కు, ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ అంటూ కేటీఆర్‌కు క్యాప్సన్స్ రాశారు. ఇలా వివిధ పార్టీల నేతలందరినీ ఒకే ఫ్లెక్సీలో ముద్రించడంతో అక్కడికి వచ్చిన భక్తులు ఆసక్తిగా చూస్తున్నారు. ఇక, ఇటీవల సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ వెంకటాపురం గ్రామంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, నటుడు నందమూరి బాలకృష్ణ ఫోటోలతో ఫ్లెక్సీ ఏర్పాటు వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. తాజాగా అదే తరహాలో ఘట్‌కేసర్ జాతరలో ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం ఫ్లెక్సీ పాలిటిక్స్ అంటూ నెట్టంట చర్చనీయాంశంగా మారింది.