- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫ్లాష్.. ఫ్లాష్.. ఉద్యోగాల భర్తీపై కేసీఆర్ సంచలన ప్రకటన
దిశ, వెబ్‌డెస్క్: నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ భారీ గుడ్ న్యూస్ తెలిపారు. 91,142 పోస్టులను భర్తీ చేయనున్నట్లు అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. 80,039 పోస్టులకు ఇవాళ్టి నుంచే నోటిఫికేషన్లు ఆయా శాఖలు ఇస్తాయన్నారు. 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తున్నట్లు స్పష్టం చేశారు. పోలీస్ శాఖలో 18,334 ఖాళీలు, విద్యాశాఖలో 13,086, వైద్యరోగ్యశాఖలో 12,755, ఉన్నతవిద్యాశాఖలో 7,878 ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. అటెండర్ నుంచి ఆర్డీవో వరకు స్థానికులకే ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇప్పటివరకు లక్షా 30 వేల ఉద్యోగాలను భర్తీ చేసినట్లు కేసీఆర్ చెప్పారు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి గ్రూప్ 1, గ్రూప్ 2 ఖాళీలను భర్తీ చేయనున్నారు. గ్రూప్- 1 లో 503, గ్రూప్ -2లో 582, గ్రూప్-3లో 1373, గ్రూప్-4లో 9168 పోస్టులను భర్తీ చేయనున్నారు.జిల్లా స్థాయిలో 18,866, మల్టీజోన్‌లో 13,170 పోస్టులు, అదర్ కేటగిరి వర్సిటీలలో 8,174 పోస్టులు భర్తీ చేయనున్నారు