తొలి లోక్‌‌సభ అభ్యర్థిని ప్రకటించిన గులాబీ బాస్ కేసీఆర్

by GSrikanth |   ( Updated:2024-03-04 10:48:50.0  )
తొలి లోక్‌‌సభ అభ్యర్థిని ప్రకటించిన గులాబీ బాస్ కేసీఆర్
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల వేళ గులాబీ బాస్ కేసీఆర్ దూకుడు ప్రదర్శిస్తున్నారు. వరుసగా రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ సెగ్మెంట్ల నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాజాగా.. ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఖమ్మం లోక్‌సభ అభ్యర్థిని ప్రకటించారు. సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వర రావును తొలి లోక్‌సభ అభ్యర్థిగా అనౌన్స్ చేశారు.

ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ వర్సస్ బీఆర్ఎస్ పోరు రసవత్తరంగా మారుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన బీఆర్ఎస్ పార్టీ.. పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగి వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఈ సారి ఎలాంటి ఛాన్స్ తీసుకోకుండా గెలుపు గుర్రాలనే బరిలోకి దింపాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అభ్యర్థులకు ముందుగానే సమాచారం ఇచ్చి క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

Next Story