- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సెక్షన్ 19 ప్రకారమే కవితను అరెస్ట్ చేశాం: ఈడీ
దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు గత మార్చి 15న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కవిత జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైలులో ఉన్నారు. అయితే ఆమె కస్టడీ గడువు ముగియడంతో ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టులో ఆమెను హాజరుపరిచారు. కస్టడీ పొడిగింపు పిటిషన్‌తో పాటు బెయిల్ పిటిషన్‌పై కూడా విచారణ జరిగింది. అనంతరం తీర్పును కోర్టు రేపటికి వాయిదా వేసింది. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు బెయిల్ పిటిషన్‌పై విచారణ కొనసాగనుంది. కవితకు బెయిల్ ఇవ్వొందంటూ ఈడీ వాదనలు వినిపించాయి. కవితను చట్టబద్ధంగానే సెక్షన్ 19 ప్రకారమే అరెస్ట్ చేశామని ఈడీ పేర్కొంది. కవిత తరపున న్యాయవాది నితేష్ రానా వాదనలు వినిపించగా... ఈడీ తరపున లాయర్ జోయబ్ హుస్సేన్ వినిపించారు. ఈడీ వాదనల అనంతరం ఈ కేసుపై విచారణను కోర్టు రేపటికి (బుధవారం) వాయిదా వేసింది. రేపు కూడా వాదనలు కొనసాగనున్నాయి. రేపు మధ్యాహ్నం ఇరువురి వాదనలు రౌస్ అవెన్యూ కోర్టు విననుంది.