కవిత అరెస్ట్ వాట్ నెక్ట్స్! గులాబీ పార్టీకి స్ట్రోక్?

by Ramesh N |   ( Updated:2024-04-11 10:53:55.0  )
కవిత అరెస్ట్ వాట్ నెక్ట్స్! గులాబీ పార్టీకి స్ట్రోక్?
X

డైనమిక్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ పాలసీలో ఎమ్మెల్సీ కవిత ప్రమేయం ఉన్నట్లు ఈడీ, సీబీఐ అనుమానిస్తున్నది. ఈ క్రమంలోనే తీహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితను తాజాగా సీబీఐ కూడా అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. అయితే ఏప్రిల్ 6న కవితను సీబీఐ విచారించింది. లిక్కర్ కేసులో సీఎం కేజ్రీవాల్ పాత్ర, తెరవెనుక ఎవరెవరు ఉన్నారు..? లాంటి అనేక విషయాలపై లోతుగా సీబీఐ విచారణ చేసింది. అయితే రేపు (శుక్రవారం) నాడు కవితను సీబీఐ కోర్టు ముందు హాజరుపరిచే అవకాశముంది. కోర్టు ఇచ్చే తీర్పుపై కేసు మరింత ముందుకు సాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఎమ్మెల్సీ కవిత బెయిల్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ అరెస్ట్‌తో అటు ఢిల్లీ, ఇటు తెలంగాణలో ఆప్, బీఆర్ఎస్ శ్రేణులు సర్వత్ర ఉత్కంఠతో ఉన్నారు.

పండగ పూట గులాబీ పార్టీకి స్ట్రోక్!

లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి ఇప్పటికే గడ్డుకాలం నడుస్తోంది. వరసగా కీలక నేతలు పార్టీ మారటం, మరోవైపు కవిత అరెస్ట్‌తో ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. తీహార్ జైల్లో ఉన్న కవితకు బెయిల్ వస్తుందేమోనని ఆశలు పెట్టుకున్న పార్టీకి సీబీఐ అరెస్ట్‌తో రంజాన్ పండగ పూట పార్టీకి మరో స్ట్రోక్ తగిలినట్లైందని పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తోంది. ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ ఏం చేయబోతుందోనని సర్వత్రా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ అరెస్ట్ లోక్‌సభ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతోందని పార్టీ హైకమాండ్ ఆలోచిస్తున్నట్లు తెలిసింది. ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌ను ఈ ఎన్నికల్లో పాజిటీవ్‌గా మార్చుకునే ప్రయత్నం హైకమాండ్ చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Advertisement

Next Story