- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పూలను పూజించడం తెలంగాణ సంస్కృతికి నిదర్శనం
దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : పూలను పూజించడం తెలంగాణ రాష్ట్ర గొప్ప సంస్కృతి అని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ కొనియాడారు. బుధవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ కుటుంబ సమేతంగా హాజరై వేడుకలను ప్రారంభించారు. బతుకమ్మలను ఒక్క చోటికి చేర్చి పోలీసు ఆడపడుచుల ఆట పాటలు, కోలాటాలతో జిల్లా పోలీస్ కార్యాలయంలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎక్కడైనా దేవుళ్లకు పూలు పెట్టి కొలుస్తాము కానీ పూలనే దేవతగా కొలిచే సాంప్రదాయం ఒక్క తెలంగాణలో మాత్రమే ఉందన్నారు. తెలంగాణ సంస్కృతికి చారిత్రక చిహ్నం బతకమ్మని, ఈ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతున్నాయని తెలిపారు. పోలీసు వారి కుటుంబ సభ్యులతో బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నందుకు ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సీఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు, మహిళా సిబ్బంది పాల్గొన్నారు.
- Tags
- SP Akhil Mahajan