- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ .. కలెక్టర్‌కు ఫిర్యాదు
దిశ,మల్లాపూర్: తాము డబ్బులు కట్టినా కానీ బ్యాంకు వరకు చేరడం లేదని వివోఏ డబ్బులు వేయకుండా తమ ఖాతాలను ఎలాంటి నోటీసు లేకుండా బ్యాంకు వారు ఫ్రిజ్ చేశారని మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన సాయినాథ లోకమాత వడ్డెర సంఘ సభ్యులు సబ్ కలెక్టర్ కి వినతి పత్రం అందించారు. గత సంవత్సరంలో కొంతమంది రాజీనామా చేయగా.. లోన్ నిమిత్తం వివోఏని సంఘ సభ్యులు కలవగా సంఘంలో పదిమంది ఉంటే తప్ప ఇవ్వడం కుదరదని తెలిపారు. కాగా సంఘ సభ్యులు పదిమందిని చేర్చుకుని పదిమంది సభ్యులతో లోన్ తీసుకోవడం జరిగిందని వివరించారు. కాగా కొవిడ్ సమయంలో ఇద్దరు సభ్యులు బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేయలేదని, తరువాత నాలుగు నెలల నుండి ఇద్దరు సభ్యులు పెండింగ్ లో ఉన్న డబ్బులు కట్టినా ఇప్పటికీ బ్యాంకులో జమ చేయడం లేదని బ్యాంకు మేనేజర్ ని అడిగారు. అయితే తమ ఖాతాలు ఫ్రిజ్ లో ఉన్నాయని తెలపడంతో ఏం చేయాలో అర్థం కాక సబ్ కలెక్టరేట్ లో మహిళలు మొర పెట్టుకున్నారు. ఏదైనా ఉంటే మీ వివోఏని కలుపుకుని బ్యాంకులోకి రావాలని వివోఏ చెప్పినట్లుగానే మేము నడుచుకుంటామని బ్యాంక్ మేనేజర్ తెలపడంతో సబ్ కలెక్టరేట్ ను ఆశ్రయించినట్లు వివరించారు.
ఇప్పటివరకు ఎలాంటి పెండింగ్ లేకుండా తాము వివోఏకి డబ్బులు కట్టామని,కానీ వివోఏ బ్యాంకులో జమ చెయ్యలేదని ఆర్డీవో ముందు మహిళలు ఆరోపించారు. రెండు సంవత్సరాల నుండి డబ్బులు కట్టినప్పటికీ బ్యాంక్ మేనేజర్ బ్యాంకు స్టేట్మెంట్ లో ఆరు నెలలు డబ్బులు కట్టినట్లు చూపించడం గమనార్హం. చదువురాని తమకి వివోఏ అన్యాయం చేసిందని, వివోఏ పై చర్యలు తీసుకోవాలని ఆర్ డి ఓ తో మహిళలు అన్నట్లు తెలిపారు. తమకు ఎలాంటి నోటీసులు లేకుండా బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసి ఇబ్బందులకు గురి చేస్తున్న బ్యాంక్ మేనేజర్ , అలాగే వివోఏపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని సంఘ సభ్యులు మొరపెట్టుకున్నారు. సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.