- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
అంబులెన్స్ లో మహిళ ప్రసవం
దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధిః అంబులెన్స్ లోనే మహిళ ప్రసవించిన ఘటన జిల్లాలోని కోనరావుపేట మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని బవుసాయిపేట గ్రామానికి చెందిన షేక్ గోరేబి కి సోమవారం ఉదయం పురిడినొప్పులు రాగా, కుటుంబ సభ్యులు 108 కి సమాచారం అందించారు. 108 సిబ్బంది అంబులెన్స్ తో గోరేబి ఇంటికి చేరుకొని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఇది ఈమెకు నాలుగో సంతానం. కాగా ఇద్దరమ్మాయిలు, ఒక బాబు ఉన్నారు. పురిటి నొప్పులు పడుతున్న గోరేబి ప్రసవించడానికి ఆశా వర్కర్ ఏం.బాబాయి, పైలెట్ చాణక్య, ఈఎంటి గణేష్ సకాలంలో తగిన చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్లు వారు తెలిపారు. ప్రసవం అనంతరం తల్లి బిడ్డను వేములవాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. సకాలంలో చర్యలు తీసుకున్న అంబులెన్స్ సిబ్బందికి గోరేబి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.