Whip Adi Srinivas : బీఆర్ఎస్ హయాంలో శంకుస్థాపనలకే పరిమితం

by Sridhar Babu |
Whip Adi Srinivas : బీఆర్ఎస్ హయాంలో శంకుస్థాపనలకే పరిమితం
X

దిశ, కథలాపూర్ : బీఆర్ఎస్ హయాంలో శంకుస్థాపనలకే పరిమితం అయ్యారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Whip Adi Srinivas) అన్నారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ పరిధిలో భాగంగా జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం కలికోట గ్రామ శివారులో నిర్మించతలపెట్టిన సూరమ్మ చెరువు రిజర్వాయర్ ను శుక్రవారం ఈఎన్సీ అనిల్, ఈసీ సుధాకర్, ఈఈ అమరేందర్ రెడ్డి, సంతు ప్రకాష్ తో కలిసి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Whip Adi Srinivas) సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కథలాపూర్, భీమారం, మేడిపల్లి మండలాల వరప్రదాయినిగా పేరుగాంచిన కలికోట సూరమ్మ ప్రాజెక్ట్ పనులు ఇదివరకే ప్రారంభించామని, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 43 వేల ఎకరాలకు సాగు నీరు అందిస్తామని చెప్పిన మాటలు శంకుస్థాపనలకే పరిమితం అయ్యాయని విమర్శించారు. కాగా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం సాగు నీటి ప్రాజెక్టులకు మొదటి ప్రాధాన్యతను ఇస్తుందని గుర్తు చేశారు.

కాగా మొన్నటి బడ్జెట్ లో రూ.325 కోట్లను (325 crores)కేటాయించామన్నారు. అలాగే సూరమ్మ ప్రాజెక్ట్ కుడి, ఎడమ కాల్వలకు సర్వే పూర్తి చేశామని, మెయిన్ కెనాల్ ద్వారా 520 ఎకరాలు రైతులు తమ భూములను కొల్పోతున్నారని, అందులో భూమి కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం చెల్లింపుల ప్రక్రియ త్వరలో కొనసాగుతుందని తెలిపారు. మొదటగా రూ.5 కోట్లను చెరువు పనుల నిమిత్తం, తర్వాత కుడి, ఎడమ కాల్వలకు మరో రూ.10 కోట్లను కేటాయించాలని నిర్ణయించారు. అలాగే కాల్వ నిర్మాణానికి భూసేకరణ పనులు ప్రారంభిస్తున్నామని, దీనికి రైతులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు కాయితీ నాగరాజు, బ్లాక్ అధ్యక్షులు ఎండీ. అజీమ్, పీసీసీ కార్యవర్గ సభ్యులు తోట్ల అంజయ్య, మున్నూరుకాపు సంఘం అధ్యక్షులు చెదలు సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి జవ్వాజి రవి, వెల్చాల సత్యనారాయణ, రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి కల్లెడ గంగాధర్, యూత్ అధ్యక్షులు జవ్వాజి చౌదరి, తిరుపతి, బోదాసు నర్సయ్య, ఎన్ ఎస్యూ ఐ ప్రెసిడెంట్ ఆకుల సంతోష్, వర్దినేని లింగా రావు, మట్టాగజం నర్సయ్య, ఆకుల వినోద్ పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed