ప్రజాపాలనలో అర్హులందరికీ సంక్షేమ ఫలాలు

by Sridhar Babu |
ప్రజాపాలనలో అర్హులందరికీ సంక్షేమ ఫలాలు
X

దిశ, తిమ్మాపూర్ : రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో ప్రజా పాలన కొనసాగుతుందని, ఈ పాలనలో అర్హులందరికీ సంక్షేమ ఫలాలను అందజేయడమే తమ ధ్యేయమని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. దసరా వేడుకలను పురస్కరించుకొని తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీలో ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన రామ్ లీలా కార్యక్రమానికి ముఖ్య అతిథి విచ్చేసి మాట్లాడారు.

చెడుపై మంచి సాధించిన విజయమే విజయదశమి అని అన్నారు. అనంతరం నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అనంతరం రావణాసుర వథ, భారీ క్రాకర్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ఆర్డీఓ మహేశ్వర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, రాంలీలా కమిటీ సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed