మూగజీవాల దాహం తీర్చేందుకు మనవంతు సహకారం అందించాలి

by Disha Web Desk 15 |
మూగజీవాల దాహం తీర్చేందుకు మనవంతు సహకారం అందించాలి
X

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : పశువులు, పక్షులు మూగజీవాల దాహం తీర్చేందుకు మనవంతు సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదివారం తెలిపారు. వేసవికాలం ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో మూగజీవాలు చుక్క నీటి కోసం మైళ్ళ దూరం ప్రయాణిస్తూ ప్రాణాలు కోల్పోతున్నాయని, పక్షి జాతుల్లో కొన్ని అంతరించిపోవడానికి వేసవి కూడా ఒక కారణమని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పక్షులు పశువుల దాహం తీర్చడానికి మన వంతు సహకారం చేయాలని,

మన ఇంటి ప్రాంగణంలో గిన్నెలో నీళ్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ కోరారు. జిల్లాలోని పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువుల, పక్షుల సంరక్షణకు కావాల్సిన ఆహారం, నీళ్లు, షెల్టర్ ఇతర వైద్య సహకారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, అదేవిధంగా పశువుల సంక్షేమ సంస్థలు, పశు ప్రేమికులు వివిధ స్వచ్ఛంద సంస్థల సహకారంతో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, ప్రతి ఒక్కరూ ఇంటి వద్ద గిన్నెలో నీళ్లు పెట్టడం వల్ల కొంత వాటి దాహార్తిని తీర్చగలుగుతామని పేర్కొన్నారు.



Next Story

Most Viewed