- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్యాన్సర్ రహిత సమాజం కోసం కృషి చేయాలి: మంత్రి గంగుల కమలాకర్
దిశ, కరీంనగర్ టౌన్: క్యాన్సర్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆదివారం పట్టణంలోని శ్వేతా హోటల్ లో గౌతమి ఫౌండేషన్ నిర్వాహకులు డా.గౌతమి -రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో 'ఆరంభ్' కార్యక్రమానికి మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గౌతమి ఫౌండేషన్ ద్వారా క్యాన్సర్ రహిత సమాజం కోసం నిర్వాహకులు డా.గౌతమి -రోహిత్ రెడ్డి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయం అన్నారు. పవిత్ర వైద్య వృత్తి నిర్వహిస్తూ, ప్రజల్లో మార్పు కోసం సామాజిక సేవ చేస్తున్న గౌతమి ఫౌండేషన్ మరెన్నో గొప్ప కార్యక్రమమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. రామడుగు మండలం కొక్కెరకుంట గ్రామాన్ని దత్తత తీసుకొని రెండు ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయం చేస్తూ.. ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తున్నారని అభినందించారు.
రసాయన ఎరువులతో వ్యవసాయం చేయడం వల్ల చాలా మంది దీర్ఘ కాలిక వ్యాధుల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత కాలంలో చిన్న పిల్లల నుంచి యువకుల వరకు క్యాన్సర్, గుండె జబ్బుల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ తమ ఆహారపు అలవాట్లను, జీవన శైలిలో మార్పు తెచ్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, జడ్పీ చైర్ పర్సన్ కనమల్ల విజయ, డా.రామ్ కిరణ్, కార్పొరేటర్లు బోనాల శ్రీకాంత్, తోట రాములు, మిడిదొడ్డి నవీన్ పాల్గొన్నారు.