కరీంనగర్ లో వీఆర్ఏల సంబరాలు.. స్వీట్ల పంపిణి

by Sumithra |
కరీంనగర్ లో వీఆర్ఏల సంబరాలు.. స్వీట్ల పంపిణి
X

దిశ, కరీంనగర్ టౌన్ : ప్రభుత్వ ఉద్యోగులకు స్వర్గధామంగా మారిన తెలంగాణలో కాంట్రాక్టు ఉద్యోగులను సైతం రెగ్యులరైజ్ చేస్తూ దేశానికే మార్గదర్శకంగా తెలంగాణ నిలుస్తుంది. మొన్నటి విద్యుత్ ఉద్యోగులు, నిన్నటి కాంట్రాక్టు లెక్చరర్ల తర్వాత నేడు వీఆర్ఏలను ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వీఆర్ఏలు రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ ను కరీంనగర్ లో ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు. సీఎం కేసీఆర్ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా 23,000 మంది, కరీంనగర్ జిల్లాలో 700 మంది వీఆర్ఏలు లబ్ది పొందుతున్నారు.

ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా జేఏసీ నలువాల మల్లేశం, చైర్మన్ కిన్నెర కొమరయ్య, జనరల్ సెక్రెటరీ చెట్టి రవి, ట్రెజరర్ పూరెల్ల మధు, కన్వీనర్ నలువాల సాయి కిషోర్, కో-కన్వీనర్ ట్రెసా యూనియన్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు పడిగెల రాజ్ కుమార్, కరీంనగర్ జిల్లా ట్రెస్సా అధ్యక్షులు నల్లా వెంకటరెడ్డి, ట్రెస్సా జనరల్ సెక్రెటరీ విజయ్, కరీంనగర్ అర్బన్, రూరల్ తహసీల్దార్లు సుధాకర్, నారాయణ తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed