సరిహద్దు చెక్ పోస్ట్‌ల వద్ద అప్రమత్తంగా ఉండాలి : జిల్లా ఎస్పీ

by Disha Web Desk 23 |
సరిహద్దు చెక్ పోస్ట్‌ల వద్ద అప్రమత్తంగా ఉండాలి : జిల్లా ఎస్పీ
X

దిశ,రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : సరిహద్దు చెక్ పోస్ట్ ల వద్ద అప్రమత్తంగా ఉంటూ వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. లోక్ సభ ఎన్నికల సందర్భంగా రుద్రంగి పోలీస్ స్టేషన్ పరిధిలోని మానాల క్రాస్ రోడ్ వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ బుధవారం ఆయన ఆకస్మిక తనిఖీ చేసి వాహన తనిఖీలు చేసి వాహనాలను నమోదు చేసిన రిజిస్టర్ ను పరిశీలించడం తో పాటు, ప్రత్యక్షంగా పోలీస్ సిబ్బంది వాహనాలు తనిఖీలు చేస్తున్న తీరును క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. తనిఖీల సమయంలో సిబ్బంది అప్రమత్తంగా వ్యవహారించడంతో పాటు, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేసి అక్రమ నగదు, మద్యం రవాణాను అరికట్టాలని సూచించారు.

ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన రోజు నుండి జిల్లాలో రూ. 65,99,900-/ రూపాయలు స్వాధీనం చేసుకుని, జిల్లా గ్రీవెన్స్ కమిటీకి అప్పగించడం జరిగిందన్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టడానికి డబ్బులు, మద్యం, ఇతర విలువైన వస్తువులు తీసుకొని వెళ్తున్నట్లు సమాచారం ఉంటే డయల్ 100 కి లేదా సంబంధిత పోలీస్ స్టేషన్ వారికి సమాచారం అందించాలని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు ఎవరైనా పాల్పడిన, ఎన్నికల నియమావళి ప్రకారం ప్రకారం చట్ట రీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా ఎస్పీ తెలిపారు. ఎస్పీ వెంట సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ అశోక్, చెక్ పోస్ట్ సిబ్బంది ఉన్నారు.



Next Story

Most Viewed