ఉడకని అన్నం... విద్యార్థులకు అస్వస్థత

by Sridhar Babu |
ఉడకని అన్నం... విద్యార్థులకు అస్వస్థత
X

దిశ, తిమ్మాపూర్ : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలోని మహాత్మ జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో ఉడకని అన్నం తిని విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. వారం రోజుల నుంచి అన్నం ముద్దలుగా గడ్డలు కట్టి ఉంటుంది. దీంతో విద్యార్థులకు కడుపు నొప్పితో పాటు వాంతులు, విరేచనాలు అవుతున్నాయి. కొంత మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఉపాధ్యాయులు వారి తల్లి తండ్రులకు సమాచారం అందించి గోప్యంగా ఆసుపత్రికి తరలించారు.

తమ పిల్లలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని గురుకుల పాఠశాల సిబ్బంది పై తల్లిదండ్రులు మండిపడుతున్నారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు గురుకుల హాస్టల్ వద్దకు చేరుకొని ప్రిన్సిపాల్ తో గొడవకు దిగారు. అంతే కాకుండా కళాశాలలోనికి వచ్చేందుకు రిపోర్టర్లకు అనుమతి లేదంటూ ప్రిన్సిపాల్ అడ్డుకున్నారు. ప్రిన్సిపాల్ తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు సైతం ఆగ్రహానికి గురయ్యారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

ఆర్సీఓ విచారణ..

కాగా మహాత్మా జ్యోతిబా పూలే పాఠశాలలో ఉడికీ ఉడకని అన్నం పెడుతున్న సమాచారం తెలుసుకున్న ఆర్సీఓ అంజలి బుధవారం పాఠశాలను సందర్శించారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కాగా ఆర్సీఓ వచ్చిన సమయంలో కూడా ముద్ద ముద్దగా ఉన్న అన్నం మాత్రమే విద్యార్థులకు వడ్డించారు. కాగా పాఠశాలకు సప్లై అయిన బియ్యం కొత్తవి కావడం తోనే అన్నం ముద్దగా ఉంటుందని కొందరు ఉపాధ్యాయులు ఆర్సీఓ కు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed