హోంవర్క్ చేయలేదని చిన్నారిని చితకబాదిన టీచర్.. చెవికి గాయం

by Nagam Mallesh |
హోంవర్క్ చేయలేదని చిన్నారిని చితకబాదిన టీచర్.. చెవికి గాయం
X

దిశ, జగిత్యాల టౌన్ : హోంవర్క్ చేయలేదని బాలికను టీచర్ కొట్టిన ఘటన జగిత్యాల టిఆర్ నగర్ లో చోటుచేసుకుంది. రెండో తరగతి చదువుతున్న బాలికపై టి ఆర్ నగర్ ప్రభుత్వ స్కూల్ ఉటీచర్ గా పని చేస్తున్న కుమార్ చేయి చేసుకున్నాడు. దీంతో బాలిక చెవి పోగు గుచ్చుకొని చిన్నపాటి గాయం అయ్యి రక్తం కారింది. విషయం తెలుసుకున్న పేరెంట్స్ సదరు టీచర్ పై ఆగ్రహం వ్యక్తం చేసారు. చికిత్స నిమిత్తం బాలికను ఆర్ఎంపి వైద్యుడు దగ్గరికి తీసుకువెళ్లారు. అయితే ఈ ఘటనపై టీచర్ ను వివరణ అడగగా హోంవర్క్ చేయకపోవడంతో ప్రేమ పూర్వకంగానే చెంప పై తట్టానని అయితే చెవి పోగు చర్మానికి గుచ్చుకొని రక్తం కారినట్లు తెలిపాడు. ఉద్దేశపూర్వకంగా విద్యార్థినిపై చేయి చేసుకోలేదని వివరణ ఇచ్చాడు.

Advertisement

Next Story