- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంత్రివర్యా ! మా ఊరికి రోడ్డేయండి..
దిశ, సైదాపూర్ : కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని లస్మన్నపల్లి గ్రామం నుంచి వెన్నంపల్లి బస్ స్టాండ్ కు వెళ్లాలంటే విద్యార్థులకు, ప్రయాణీకులకు, పాదచారులకు ఇబ్బందులు తప్పటం లేదు. వెన్నంపల్లి - లస్మన్నపల్లి గ్రామాలకు వెళ్లే రహదారి కొద్ది పాటి వర్షాలకే బురదమయమై నడవడానికి వీలు లేని పరిస్థితి నెలకొంది. లస్మన్నపల్లి గ్రామానికి చెందిన విద్యార్థులు వెన్నంపల్లి జిల్లా పరిషత్ పాఠశాలకు వెళ్తుంటారు. అలాగే ఇతర గ్రామాలకు వెళ్లాలంటే వెన్నంపల్లి బస్ స్టాండ్ కు వెళ్లాలి. అంతే కాకుండా వెన్నంపల్లి గ్రామానికి చెందిన విద్యార్థులు ఇదే దారి వెంట సోమారం ఆదర్శ పాఠశాలకు వెళ్తుంటారు. రేషన్ సరుకుల కోసం వెన్నంపల్లి నుంచి లస్మన్నపల్లి గ్రామానికి వస్తుంటారు. గుంతల మయమైన ఈ రోడ్డులో హుజూరాబాద్, తుమ్మనపల్లి, ప్రయివేట్ పాఠశాల వ్యాన్ లు ప్రతిరోజు ఉదయం సాయంత్రం రావటంతో బురదగా మారి విద్యార్థుల రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు.
ఏళ్లు గడుస్తున్నా పట్టించుకోని వైనం..
ఈ రెండు గ్రామాల మట్టి రోడ్డు యేండ్లు గడుస్తున్నా మరమ్మతులకు నోచుకోలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఈ రోడ్డుకు తట్టెడు మట్టిపోయలేదని గ్రామస్తులు తెలిపారు. గత ప్రభుత్వంలో ఈ రెండు గ్రామాలకు చెందిన వ్యక్తులే ఒకరు ఎంపీపీ, మరో వ్యక్తి జెడ్పీటీసీ సభ్యులుగా ఉన్నప్పటికీ ఎలాంటి మరమ్మతులు చేయలేదని వారి పై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మంత్రివర్యా రోడ్డెయ్యండి..
మంత్రివర్యా మా గ్రామానికి రోడ్డెయ్యండని లస్మన్నపల్లి గ్రామానికి చెందిన గ్రామస్తులు హుస్నాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయినా పోన్నం ప్రభాకర్ ను కోరుతున్నారు. గత ప్రభుత్వంలో రోడ్డు నిర్మాణానికి ఎలాంటి నిధులు మంజూరు కాలేదని మంత్రి నిధులు మంజూరు చేసి రోడ్డు నిర్మాణం చేపట్టాలని గ్రామస్తులు మంత్రిని వేడుకుంటున్నారు.