తొలగనున్న నారాయణపురం రైతుల కష్టాలు

by Aamani |
తొలగనున్న నారాయణపురం రైతుల కష్టాలు
X

దిశ,కేసముద్రం : కొన్నేళ్లుగా వివాదాస్పదంగా మారిన భూముల విషయంలో మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం గ్రామ రైతులకు ఊరట లభించింది. ఆరు సర్వేనెంబర్ పట్టాదారు కాలంలో ఉన్న 'అడవి/ ఫారెస్ట్' అనే పదాలను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ తాజాగా ఉత్తర్వులు జారీ చేయడంతో కష్టాలు గట్టెక్కాయి. ధరణి పోర్టల్ వచ్చాక.. గ్రామంలోని 1398.03 ఎకరాలకు సంబంధించి 149, 150, 154, 165, 166, 168 సర్వే నెంబర్ లో పట్టాదారు కాలంలో 'అడవి, ఫారెస్ట్' అని వస్తుంది. దీంతో సంబంధిత రైతులు పలుమార్లు ఈ సమస్యను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయమై జిల్లా రెవెన్యూ, అటవీశాఖాధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించి అవి పట్టా భూములుగా నిర్ధారించి ప్రభుత్వానికి నివేదిక అందించారు. నివేదిక ఆధారంగా 'అడవి/ ఫారెస్ట్' ల పేర్లను తొలగించాలని ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీచేశారు.

Advertisement

Next Story