భవిష్యత్తు అంతా విద్యార్థులదే

by Sridhar Babu |
భవిష్యత్తు అంతా విద్యార్థులదే
X

దిశ,హుజురాబాద్ రూరల్ : భవిష్యత్తు విద్యార్థులపైనే ఆధారపడి ఉన్నందున వారు ఆరోగ్యంగా ఎదగడానికి పరిశుభ్రంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పమేల సత్పతి అన్నారు. మండలంలోని చెల్పూర్ సెకండరీ పాఠశాలలో మంగళవారం నిర్వహించిన గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే సందర్భంగా ఆమె పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరిశుభ్రత తో చాలా వ్యాధులను అరికట్ట వచ్చునని అన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని కోరారు. విద్యార్థులు క్రమశిక్షణతో ఉంటూ తమకు ప్రభుత్వం అందజేసిన యూనిఫామ్ ధరించి సమయానికి పాఠశాలకు రావాలని సూచించారు.

పీఎంశ్రీ కింద ఎంపికైన పాఠశాలలో కనీస మౌలిక వసతులు కల్పించడం జరుగుతుందన్నారు. విద్యార్థులు మనోధైర్యంతో నాణ్యమైన విద్యను అందుకొని ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ఎదగాలన్నారు. విద్య ద్వారానే పేదరికం నిర్మూలించవచ్చని, అందుకే మంచి విద్య, క్రమశిక్షణ ,విద్యార్థులకు అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రమేష్ బాబు, యూనిసెఫ్ రాష్ట్ర ప్రతినిధులు కాశీనాథ్, ఫణీంద్ర, తహసీల్దార్ కనకయ్య ,ఎంపీడీఓ సునీత, ప్రధానోపాధ్యాయురాలు అనురాధ, యూనిసెఫ్ జిల్లా సమన్వయకర్త కిషన్ స్వామి,ఎంపీఓ సతీష్ ,ఎస్బీఎం రవీందర్, వేణు, ఏపీఎం తిరుపతి, నాగరాజు, కళ్యాణి, రవీందర్, ప్రవీణ్ పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed