- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సిరిసిల్లలో ఉద్రిక్తత.. అభ్యర్థి ఫ్లెక్సీలు తొలగించిన మున్సిపల్ అధికారులు
దిశ, సిరిసిల్ల : సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సిరిసిల్ల మున్సిపల్ అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఫ్లెక్సీలు తొలగించారని ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి పత్తిపాక సురేష్ తన అనుచరులతో కలిసి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ, రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. కేటీఆర్ ఎలక్షన్ కమిషన్ అధికారులు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ధర్నా విరమించాలని ఆందోళనకారులను కోరారు. ప్రధాన రహదారి పై ట్రాఫిక్ జామ్ కావడంతో ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఆందోళనకారులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుని ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
పోలీసులు ఆందోళనకారులను, అభ్యర్థి సురేష్ ను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా ఏఐఎస్బీ అభ్యర్థి పత్తిపాక సురేష్ మాట్లాడుతూ సిరిసిల్లలో కేటీఆర్ కు కేంద్ర ఎన్నికల సంఘం సహకరిస్తుందని, అందువల్లే మున్సిపల్ అధికారులు కేటీఆర్ ప్లెక్సీలు తొలగించకుండా, తమ ఫ్లెక్సీలను మాత్రం ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తొలగించారన్నారు. సామాన్యమైన మధ్యతరగతి నాయకుని పై వివక్ష కొనసాగుతుందని మండిపడ్డారు. కేటీఆర్ కు ఒక న్యాయం తమకు న్యాయమా అంటూ ప్రశ్నించారు. కేటీఆర్ కు ఆఖరి క్షణాలు మొదలయ్యాయని, ఈ ఎన్నికలు ఆయనకు చివరి ఎన్నికలు అవుతాయని హెచ్చరించారు.