- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అభివృద్ధి, సంక్షేమంలో అగ్రగామిగా తెలంగాణ : మంత్రి కొప్పుల ఈశ్వర్
దిశ, పెగడపల్లి: అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. పలు అభివృద్ధి పనుల నిమిత్తం మండలంలోని నామపూర్, మడ్డులపల్లి, ఆరవెల్లి గ్రామాల్లో ఆయన పర్యటించారు. నామపూర్ లో సహకార సంఘం అధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని , తెలంగాణ క్రీడా ప్రాంగణన్ని ప్రారంభించారు. అదే విధంగా మద్దులపల్లిలో నూతనంగా నిర్మించిన మంచి నీటి ట్యాంక్, మన ఊరు.. మన బడిలో భాగంగా మండల ప్రాథమికోన్నత పాఠశాలలో చేసిన అభివృద్ధి పనులను ప్రారంభించారు.
అనంతరం 29 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ఆరవెల్లిలో యాదవ సంఘం భవన నిర్మాణానికి, ఆరవెల్లి నుంచి బతికేపల్లి గ్రామానికి మధ్య వాగు మీద నిర్మించనున్న వెంతెనకు భూమి పూజ చేశారు. అనంతరం మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ ప్రతి రైతు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పేదింటి ఆడబిడ్డ పెళ్ళికి కళ్యాణ లక్ష్మి పథకం అందిస్తున్నామని, బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఇలాంటి పథకాలు ఉందా అంటూ ప్రశ్నించారు.
మన ఊరు.. మన బడి కింద ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా మౌలిక సదుపాయాలను కల్పించామని తెలిపారు. గ్రామాల్లో రహదారుల కోసం అధిక నిధులు కేటాయిస్తున్నమని, ఇలా సంక్షేమం, అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచిందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ గోలి శోభ సురేందర్ రెడ్డి, వైస్ ఎంపీపీ గాజుల గంగాధర్, మార్కెట్ కమిటీ చైర్మన్ లోక నిర్మల, వైస్ చైర్మన్ రాజు ఆంజనేయులు, సర్పంచ్ లు ఇనుగాండ్ల కరుణాకర్ రెడ్డి, గుర్రం అనూష మల్లారెడ్డి, ఉప్పులంచ లక్ష్మణ్, మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు లోక మల్లారెడ్డి, ఉపాధ్యక్షుడు సాయిని రవీందర్, ఉప సర్పంచ్ లు పెద్ది సంతోష్, నాగుల రాజ శేఖర్ గౌడ్, పార్టీ మైనారిటీ సెల్ అధ్యక్షుడు షేక్ హైదర్, తదితరులు పాల్గొన్నారు.