పొలం కాడ తండ్రి డెడ్ బాడీ... బావిలో కూతుళ్ల మృతదేహాలు లభ్యం

by S Gopi |   ( Updated:2023-02-04 07:17:12.0  )
పొలం కాడ తండ్రి డెడ్ బాడీ... బావిలో కూతుళ్ల మృతదేహాలు లభ్యం
X

దిశ, జగిత్యాల రూరల్: జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్ గ్రామంలో విషాదం నెలకుంది. గ్రామానికి చెందిన గడ్డం జలపతి రెడ్డి(40), తన ఇద్దరు కూతుళ్లు ప్రణిత్య(11), మధుమిత (9) శుక్రవారం సాయంత్రం శుభకార్యానికి వెళ్లి వస్తామని ఇంట్లో నుండి వెళ్లి తిరిగిరాలేదు. శనివారం ఉదయం మృతుడి సోదరుడు పొలానికి నీరు పెట్టడానికి వెళ్లగా వ్యవసాయ బావిలో విగత జీవిగా పడి ఉన్న జలపతిని చూసి పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మోటార్ల సహాయంతో బావిలో నీటిని తీసివేయగా జలపతి ఇద్దరు కూతుళ్ళ మృతదేహాలు కూడా బావిలో లభ్యమయ్యాయి. జలపతి దగ్గర సూసైడ్ నోట్ లభ్యమైనప్పటికీ మృతుడి ఒంటిపై గాయాలు ఉండడంతో పోలీసులు డాగ్ స్క్వాడ్ తో సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాలను పోస్ట్ మార్టమ్ నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియల్సి ఉంది. చిన్నపిల్లలతో సహా జలపతి మృతిచెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

Advertisement

Next Story

Most Viewed