కార్మికుల కష్టనష్టాలు తెలిసిన వ్యక్తిని : కొప్పుల ఈశ్వర్

by Disha Web Desk 23 |
కార్మికుల కష్టనష్టాలు తెలిసిన వ్యక్తిని : కొప్పుల ఈశ్వర్
X

దిశ,రామగిరి : కార్మికుల కష్టనష్టాలు తెలిసిన వ్యక్తిని, నన్ను ఎన్నికల్లో గెలిపిస్తే పార్లమెంట్ లో కార్మికుల సమస్యలపై గళం విప్పుతా అని మాజీ మంత్రి, పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రామగుండం రీజియన్ 3 పరిధిలోని ఓసీపీ-1, వర్క్ షాప్ లో జడ్పీ ఛైర్మన్ పుట్ట మధూకర్ తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ నేను మీ కార్మిక బిడ్డను, 26 సంవత్సరాలు సింగరేణి కార్మికుడిగా పని చేశాను అని గుర్తు చేసుకున్నారు. గతంలో కార్మికుడిగా పని చేసిన సమయంలో సమ్మెలు, పోరాటాల్లో పాల్గొన్నానని తెలిపారు.

నైన్ ఇంక్లైన్ గ్యాస్ లీకేజీ లో చనిపోయిన కార్మికులకు న్యాయం జరగాలని పోరాటం చేశానని వెల్లడించారు. ఇక్కడి నుండి మీరు దీవించి పంపితే ఎమ్మెల్యేగా, మంత్రిగా సేవ చేసే అదృష్టం దక్కిందని పేర్కొన్నారు. కార్మికుల ఫించన్ విధానంలో మార్పు రావాలని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సింగరేణి కార్మికుల ఇన్కమ్ టాక్స్ మినహాయింపు విషయంలో అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపమన్నారు. పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కార్మికులకు అన్ని విధాలుగా అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేశామని వివరించారు. రానున్న ఎంపీ ఎన్నికల్లో కొప్పుల ఈశ్వర్ కు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed