సిరిసిల్ల పట్టణ అభివృద్ధికి రూ. 2 కోట్లు మంజూరు

by Aamani |
సిరిసిల్ల పట్టణ అభివృద్ధికి రూ. 2 కోట్లు మంజూరు
X

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : సిరిసిల్ల పట్టణ అభివృద్ధికి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు కోట్ల రూపాయలు మంజూరు చేయడం పట్ల సిరిసిల్ల కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్ కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా ఇంచార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సహకారం నియోజకవర్గ ఇంఛార్జి కేకే మహేందర్ రెడ్డి చొరవతో రెండు కోట్ల రూపాయలు మంజూరు కావడంపై సిరిసిల్ల పట్టణ శాఖ పక్షాన సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కృతజ్ఞతలు తెలిపారు.

రెండు కోట్ల రూపాయలను గర్ల్స్ స్కూల్ లలో మూత్రశాలలు బోర్లకు, ప్రతి వార్డులో డ్రైనేజీలు, రోడ్డు నిర్మాణ పనులకు వినియోగించాలని మున్సిపల్ అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, జిల్లా నాయకులు వైద్య శివప్రసాద్, పట్టణ ప్రధాన కార్యదర్శి మ్యాన ప్రసాద్, కాంగ్రెస్ నాయకులు స్వర్గం రాజు, నక్క నరసయ్య, రఫీ, అస్లాం, నల్ల శ్రావణ్, గడ్డం కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed