- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Huzurabad:తీవ్ర విషాదం..గుండెపోటుతో సీనియర్ జర్నలిస్టు మృతి
దిశ, హుజురాబాద్ రూరల్:పట్టణంలోని కరీంనగర్ రోడ్డులోని విద్యానగర్‌లో నివాసం ఉండే సీనియర్ జర్నలిస్టు, ప్రముఖ న్యాయవాది బాణాల శ్యాంసుందర్ (60) గుండెపోటుతో ఆదివారం ఉదయం మరణించారు. ఆయన స్వస్థలం శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామం. గత కొన్ని సంవత్సరాలుగా హుజురాబాద్‌లో నివాసం ఉంటున్నారు. గత 30 సంవత్సరాలుగా జర్నలిస్టు వృత్తిలో, గత 15 సంవత్సరాలుగా న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్నారు. బాణాల శ్యాంసుందర్ మృత దేహాన్ని జర్నలిస్టులు, న్యాయవాదులు, రాజకీయ నాయకులు, ప్రముఖులు సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గత 30 సంవత్సరాలుగా జర్నలిస్ట్ వృత్తిలో ఉన్న శ్యాంసుందర్ మృతి సందర్భంగా జిల్లా టీయుడబ్ల్యూజే (ఐజేయూ) జర్నలిస్ట్ యూనియన్ తరపున పదివేల రూపాయలు ఆర్థిక సహాయం వారి కుటుంబ సభ్యులకు అందించారు.
గత కొన్ని సంవత్సరాలుగా ప్రముఖ దిన పత్రికల్లో ఆయన పనిచేశారు. ప్రస్తుతం ఆయన ఓ దినపత్రిక ఎడిటర్‌గా కొనసాగుతున్నారు. శ్యాంసుందర్ మృత దేహాన్ని హుజురాబాద్ ప్రెస్ క్లబ్ జర్నలిస్టులు సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆయన మృతి సమాజానికి తీరని లోటు అని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. నివాళులు ఆర్పించిన వారిలో హుజురాబాద్ ప్రెస్ క్లబ్ కన్వీనర్ గడ్డం ధర్మారెడ్డి, కో కన్వీనర్ కాయిత రాములు, సీనియర్ జర్నలిస్టులు మామిడి రవీందర్, కోరం సుధాకర్ రెడ్డి, తిరునగరి ఆంజనేయస్వామి, కేసిరెడ్డి నరసింహారెడ్డి, జిల్లా యూనియన్ నాయకులు మహేంద్ర చారి, సదానందం, కాల్వ కృష్ణ,ప్రెస్ క్లబ్ సభ్యులు, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు తదితరులు ఉన్నారు.