- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సింగరేణిలో స్క్రాప్ చోరీ.. హైదరాబాద్ కు అక్రమ రవాణా
దిశ, గోదావరిఖని: సింగరేణి నీలయమైన గోదావరిఖని రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో జోరుగా లక్షల రూపాయల విలువైన స్క్రాప్ పక్కదారి పడుతున్నట్లు తెలుస్తోంది. అడ్డగుంటపల్లి, చైతన్యపూరి కాలనీ, లక్ష్మీపురం, ఎఫ్ సీ ఐ తదితర ప్రాంతాలలో ఈ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే కొంతమంది బయటకు ప్లాస్టిక్ పేపర్లు, కవర్ల పేరుతో ఎవరికి అనుమానం రాకుండా సింగరేణి స్క్రాప్ ను పెద్ద ఎత్తున తరలిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గోదావరిఖనిలో ఈ స్క్రాప్ వల్ల రైల్వే, ట్రాన్స్ కో, సింగరేణికి భారీగా నష్టం వాటిల్లుతుంది. రాత్రికి రాత్రే సరఫరా చేస్తూ లక్షల రూపాయలను ఘడిస్తున్నారు. అయితే ఈ స్క్రాప్ ను ఇతర ప్రాంతాల నుండి సరఫరా చేసేందుకు ప్రత్యేకంగా మనుషులను సైతం పెట్టుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రత్యేకంగా అడ్డగుంటపల్లి, గంగానగర్ కేంద్రంగా ఈ స్క్రాప్ వ్యాపారం జరుగుతున్నట్లు పలువురు చర్చించుకుంటున్నారు. ఈ స్క్రాప్ కు హైదరాబాద్ లో మంచి ధర పలుకుతూ ఉండడంతో ఈ బిజినెస్ కు అడ్డూఅదుపు లేకుండా పోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా గత నెల రోజుల క్రిందట స్క్రాప్ ను తరలిస్తున్నారనే పక్క సమాచారం అందుకున్న పోలీసులు ట్రాలీ తో పాటు స్క్రాప్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇలా గుట్టుచప్పుడు కాకుండా సింగరేణికి రామగుండం నియోజకవర్గంలో ఉన్న పలు కంపెనీలకు భారీ మొత్తంలో నష్టాన్ని కలిగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
👉 రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి జిల్లా గోదావరిఖని రాజీవ్ నగర్ వద్ద సింగరేణి స్క్రాప్ అక్రమ రవాణా చేస్తున్నట్లు సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ సీఐ రాజ్ కుమార్ సిబ్బంది చంద్రశేఖర్, మల్లేష్ లతో కలిసి 30 క్వింటాల్లా 1,29,000 వేల రూపాయల స్ట్రాప్ ను స్వాధీనం చేసుకున్నారు. స్క్రాప్ అక్రమ రవాణాకు పాల్పడుతున్న తిరుపల్లి మల్లేష్ ను అదుపులోకి తీసుకొని ఎన్టీపీసీ పోలీసులకు అప్పగించారు.
👉 దేశమంతా వెలుగులు విరాజిల్లుతున్న సింగరేణి సామాగ్రికి రక్షణ లేకుండా పోతుంది. ఈ స్క్రాప్ బిజినెస్ కొందరికి లాభసాటిగా మారితే.. మరికొందరికి తలనొప్పిగా మారుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా సింగరేణి అధికారులు స్పందించి స్క్రాప్ ను దొంగలించే వారిపై కఠినంగా వ్యవహరించాలని పలువురు కోరుతున్నారు.