ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను త్వరగా పరిష్కరించాలి..: ధర్మపురి ఎమ్మెల్యే

by Aamani |
ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను త్వరగా పరిష్కరించాలి..: ధర్మపురి ఎమ్మెల్యే
X

దిశ,జగిత్యాల టౌన్ : జిల్లాలో వివిధ స్థాయిలో పెండింగ్ లో ఉన్న ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ సూచించారు. జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ అధ్యక్షతన నూతనంగా ఏర్పాటైన జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా విప్ లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ దళిత వర్గానికి ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా సకాలంలో న్యాయం జరిగేలా చూడటం తమ బాధ్యత అని పేర్కొన్నారు.

అదే విధంగా పెండింగ్ లో ఉన్న, వివాదాలు లేని ఆదివాసులు,గిరిజనుల భూములను కబ్జా కాకుండా అధికారులు చూడాలని వారు ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించి విచారణ జరిపి వారికి న్యాయం జరిగేలా చూడాలని సూచించారు. అనంతరం కలెక్టర్ సత్య ప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల నమోదు,ఆయా కేసుల పరిష్కారానికి అధికారులు తీసుకున్న చర్యలు,బాధితులకు అందించాల్సిన పరిహారం పై కమిటీ సభ్యులతో చర్చించారు. ఈ సమావేశంలో జగిత్యాల,కోరుట్ల ఎమ్మెల్యే లు డా.ఎం.సంజయ్ కుమార్,కే.సంజయ్,జిల్లా ఎస్పీ అశోక్ కుమార్,ఆర్డీవో మధుసూదన్,జగిత్యాల,మెట్ పల్లి డీఎస్పీ లు జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి రాజ్ కుమార్,జిల్లా వెల్ఫేర్ ఆఫీసర్ సాయి బాబా,వివిధ శాఖల అధికారులు,ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed