- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రజల సొమ్ముతో ప్రచారం చేస్తవా కేసీఆర్...? : RS Praveen Kumar
దిశ, వెల్గటూర్: ప్రజలు కట్టిన పన్నులతో వచ్చిన ఆదాయం రూ. వెయ్యి కోట్లను బడ్జెట్ లో బీఆర్ఎస్ పార్టీ ప్రచారానికి కేటాయించడం సిగ్గుచేటు అని, ఇతర రాష్ట్రాల్లో సొంత పార్టీ ప్రచారం కోసం ప్రజల సొమ్ము కేటాయించే హక్కు మీకు ఎవరిచ్చారని సీఎం కేసీఆర్ ను బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. ఇది కాకుండా ప్రత్యేక నిధి పేరుతో పదివేల కోట్ల రూపాయలను తన వద్దే ఉంచుకోవడం ఏంటని, తెలంగాణలో క్యాబినెట్ అనేది ఉందా మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడున్నారు.. వారికి ప్రజల సంక్షేమం అవసరం లేదా అని ప్రశ్నించారు.
కల్వకుంట్ల భజన చేసే పత్రికలకు ప్రకటనలు ఇవ్వడానికి ఈ సొమ్మంతా ఖర్చు చేయబోతున్నారని విమర్శించారు. జగిత్యాల జిల్లా నర్సింగాపూర్ గ్రామంలో జలపతి రెడ్డిది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యయే అని, అతని మృతికి కారణమైన దామోదర్ రావును అరెస్టు చేయకపోతే జగిత్యాల అగ్నిగుండం అవుతుందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బహుజన రాజ్యాధికార యాత్ర రెండవ విడతలో భాగంగా 176వ రోజులో భాగంగా బుధవారం ధర్మపురి నియోజకవర్గం, మండలంలో పర్యటించి మాట్లాడారు. తెలంగాణ వనరులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దోచుకుంటూ, ఇసుకదందాలో రోజుకు కోటి రూపాయలు సంపాదిస్తున్నారని ఆరోపించారు.
వారికి సహకరించడానికి, కాళేశ్వరం మిషన్ భగీరథ వంటి పథకాల్లో దోచుకున్న సొమ్ము గురించి ప్రశ్నించకూడదనే ఇతర రాష్ట్రాలకు చెందినవారికి ఉన్నత పదవులు కట్టబెడుతున్నారని ఆరోపించారు. శ్రీరాం సాగర్ నీటిని మహారాష్ట్రకు ఇస్తామని, శ్రీశైలం జలాల గురించి మాట్లాడకుండా ఏపీలో బీఆర్ఎస్ కోసం ఆలోచిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ బడ్జెట్ లో బీసీలకు అన్యాయం జరిగిందన్నారు. రూ. 3 లక్షల కోట్ల బడ్జెట్ లో బీసీలకు కేవలం రూ. 6 వేల కోట్లు మాత్రమే ఇస్తున్నారని మండిపడ్డారు. గత సంవత్సరం దళిత బంధుకోసం రూ. 17వేల కోట్లు కేటాయించి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదన్నారు. దుబాయ్, బొంబాయి, బొగ్గుబాయి బతుకులు పోవాలని ప్రవాసీ భారతీయుల కోసం రూ. 500 కోట్లు ఇస్తామన్న ప్రభుత్వం బడ్జెట్ లో ఒక్క రూపాయి ఇవ్వకుండా మొండి చేయి చూపిందన్నారు. బీఎస్పీ అధికారంలోకి వస్తే గల్ఫ్ బాధితుల కోసం రూ. 5 వేల కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.
మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావును బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ వేసే రోడ్లకు డబ్బు తన ఫాం హౌస్ నుండి ఇచ్చిన డబ్బు కాదని తెలిపారు. ఇలాంటి ఎమ్మెల్యేలను తెలంగాణ నుండి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణలోని బహుజలంతా దొరల కాళ్ళ దగ్గర తలచుకుని బతికే కంటే తలెత్తుకుని బహుజన పార్టీలో చేరాలని ఆయన పిలుపు నిచ్చారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ తో ధర్మపురి అభివృద్ధి కాదన్నారు. నాలుగు సార్లు గెలిచిన మంత్రి ఒక్క డబుల్ బెడ్రూం ఇవ్వలేదని, పేదలు చీకట్లో బతుకుతున్నారని ఆవేదన చెందారు. కాళేశ్వరం లింక్ 2, ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన బాధితులకు పూర్తిస్థాయిలో పరిహారం అందించటంలో విఫలమయ్యారని ఆరోపించారు. సంక్షేమ శాఖ మంత్రి పేదల సంక్షేమాన్ని గాలికొదిలేశారని విమర్శించారు. అందుకే మన పేదల బతుకులు మారాలంటే బహుజన రాజ్యం రావాలన్నారు. అందుకోసం బీఎస్పీ పార్టీని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. యాత్రలో భాగంగా చందోలి నుండి చర్లపల్లి వరకు బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ యాత్రలో జిల్లా ఇంచార్జి నారాయణ, ప్రధాన కార్యదర్శి సంపత్, జిల్లా అధ్యక్షులు పుప్పాల లింబాద్రి, నియోజకవర్గ ఇంచార్జి నక్క విజయ్, మండల అధ్యక్షులు స్వామి, లాలా గౌడ్, షాహిన్ బేగం తదితరులు పాల్గొన్నారు.